VKB: జిల్లా వ్యాప్తంగా రేషన్ కార్డుదారులకు నేటి నుంచి మూడు నెలల కోటా సరుకులను పంపిణీ చేయనున్నారు. జిల్లాలో సుమారు 3 లక్షల మంది లబ్ధిదారులు ఉండగా, నెలకు 5,500 మెట్రిక్ టన్నుల చొప్పున.. 3 నెలలకు కలిపి మొత్తం 16,500 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఇప్పటికే రేషన్ షాపులకు చేరవేశారు.