GNTR: అమరావతిని గ్రీన్ సిటీగా మార్చే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. రాజధానిలో 640 కిలోమీటర్ల మేర రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటనున్నారు. సీడ్ యాక్సిస్ సహా ప్రధాన రహదారుల వెంబడి ఈ పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఏడాది పొడవునా పూలు పూసే మొక్కలతో పాటు నీడ, ఆక్సిజన్ ఇచ్చే చెట్లను నాటుతునున్నారు. రసాయనాలు కాకుండా సేంద్రియ ఎరువులనే వినియోగించనున్నారు.