MBNR: మహబూబ్ నగర్‌కు చెందిన మంగరి వంశీకృష్ణ అనే 12 సంవత్సరాల బాలుడు “ఆకలేషియా కార్డియా” అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నారు. బాలుడిని మలక్ పేట యశోద ఆసుపత్రిలో చేర్పించగా తినే ఆహారాన్ని మింగడంలో ఇబ్బందులను గుర్తించి అధునాతన ఇండస్కోపిక్ చికిత్సను అందించారు. దాంతో బాలుడు ప్రాణాపాయం నుంచి బయటపడినట్లు గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ కిషన్ వెల్లడించారు.