»Watch Viral Video Dog Riding Bike With Wearing A Helmet
Viral Video కుక్కను చూసైనా నేర్చుకోవాల్సిందే..!
ఒక వ్యక్తి హెల్మెట్ ధరించి బైక్ నడుపుతుండగా.. అతడి వెనుకాల నల్లని కుక్క వెనక సీట్లో కూర్చొని, తన రెండు పాదాలను బైకు నడిపే వ్యక్తిపై పెట్టి,హెల్మెట్ ధరించి నిటారుగా కూర్చుని ఉంది.
ఈ రోజుల్లో బైకులు (Bike) లేనివారు ఉండటం లేదు. చేతిలో బైక్ ఉంది కదా అని ఫుల్ స్పీడ్ మీద వెళుతూ ఉంటారు. కనీసం హెల్మెట్ (Helmet) కూడా ధరించరు. ఒకవైపు ట్రాఫిక్ పోలీసులు (Traffic Police) రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, హెల్మెట్ ధరించాలి అని ఎంత చెప్పినా వినిపించుకునే వారే లేరు. ఇప్పటికీ చాలా మంది కేవలం ట్రాఫిక్ పోలీసును చూస్తేనే హెల్మెట్ ధరిస్తారు. అలాంటివారు ఈ కుక్కని (Dog) చూసి నేర్చుకోవాల్సిందే. ఓ కుక్క బైక్ పై హెల్మెట్ పెట్టుకొని వెళుతూ అందరి దృష్టి ఆకర్షించింది. ఈ వీడియో తమిళనాడులో (Tamil Nadu) తీసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నెట్టింట వైరల్ (Viral)గా మారింది.
మనిషి హెల్మెట్ ధరించి బైక్ పై కూర్చోవడం చూస్తూనే ఉంటాం. కానీ కుక్క కూడా హెల్మెట్ ధరించి మనిషిలాగా బైక్ పై కూర్చోవడం ఆశ్చర్యకరం. ఈ వీడియోలో కుక్క హెల్మెట్ పెట్టుకొని కూర్చొని అందరికీ షాకిచ్చింది. ఒక వ్యక్తి హెల్మెట్ ధరించి బైక్ నడుపుతుండగా.. అతడి వెనుకాల నల్లని కుక్క వెనక సీట్లో కూర్చొని, తన రెండు పాదాలను బైకు నడిపే వ్యక్తిపై పెట్టి,హెల్మెట్ ధరించి నిటారుగా కూర్చుని ఉంది. ఈ వీడియో వైరల్ అవడంతో నెటిజన్లు (Netizens) ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కుక్క బైక్ మీద ఎక్కి కూర్చోవడమే గ్రేట్ అంటే హెల్మెట్ కూడా పెట్టుకుందని కొందరు కామెంట్స్ (Comments) చేస్తున్నారు. మరికొందరు ఈ కుక్కని చూసైనా నేర్చుకోవాలి అంటూ కామెంట్స్ చేస్తుండటం విశేషం. ఆ కుక్క యజమానిపై కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు.