»Watch Teachers And Principal Get Into A Brawl Inside Classroom In Bihar
Watch Video కొప్పులు పట్టుకుని పిడిగుద్దులు.. సిగపట్లతో తన్నుకున్న టీచర్లు
వీరిద్దరూ పరస్పరం దూషించుకున్నారు. ఆగ్రహం తట్టుకోలేక చెప్పు తీసుకుని దాడి చేసింది. తరగతి గది బయటకు వచ్చిన వీరిద్దరూ పరస్పరం దాడి చేసుకున్నారు. మరో ఉపాధ్యాయురాలు కూడా వచ్చి విరుచుకుపడ్డారు. ముగ్గురు కొట్లాడుకున్నారు.
చిన్నపాటి గొడవ (Quarrel).. చినికి చినికి వానగా మారి ఒక యుద్ధం (War) తలపించేలా మారింది. పాఠశాలలో (School) కొప్పులు పట్టుకుని ఉపాధ్యాయులు (Teachers) పరస్పరం దాడులు చేసుకున్నారు. సిగపట్లు.. చెప్పులతో కొట్టుకోవడం బిహార్ లో కలకలం రేపింది. ఇదంతా ఒక్క కిటికీ తలుపులు విషయమై జరగడం గమనార్హం. బిహార్ (Bihar)లో జరిగిన ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ (Viral)గా మారింది.
పట్నాలోని (Patna) కొరియా పంచాయత్ విద్యాలయ (Korea Panchayat Vidyalay) పాఠశాలలో కిటికీలు మూయడంపై చిన్న వివాదం జరిగింది. తరగతి గదిలోకి (Class Room) వచ్చిన పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు (Headmistress) కాంతి కుమారి కిటికీ తలుపులు మూసివేయాలని చెప్పారు. అయితే ఉపాధ్యాయురాలు అనితా కుమారి అంగీకరించలేదు. ససేమిరా అనడంతో గొడవ ముదిరింది. ఈ సమయంలో వీరిద్దరూ పరస్పరం దూషించుకున్నారు. ఆగ్రహం తట్టుకోలేక అనితా కుమారి చెప్పు తీసుకుని కాంతి కుమారిపై దాడి చేసింది. తరగతి గది బయటకు వచ్చిన వీరిద్దరూ పరస్పరం దాడి చేసుకున్నారు. మరో ఉపాధ్యాయురాలు కూడా వచ్చి కాంతి కుమారిపై విరుచుకుపడ్డారు. ముగ్గురు కొట్లాడుకున్నారు.
దాడి చేసుకుంటూ పొలాల్లోకి (Farms) వెళ్లిపోయారు. ప్రధానోపాధ్యాయురాలి జుట్టు (Hair) పట్టుకుని పిడిగుద్దులతో విరుచుకుపడ్డారు. మరో ఉపాధ్యాయురాలి పొలంలోని ఓ కర్రతో దాడికి పాల్పడింది. ఇదంతా విద్యార్థుల ముందు చోటుచేసుకోవడం గమనార్హం. విద్యార్థులు ఉన్న విషయాన్ని మరిచి వారు దాడి చేసుకున్నారు. ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. విద్యా బుద్ధులు చెప్పి.. గొడవ పడొద్దని చెప్పాల్సిన ఉపాధ్యాయులు ఇలా కొట్టుకోవడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. అయితే ఇలా దాడి చేసుకోవడం వెనుక వేరే కారణం ఉందని తెలిసింది.
ప్రధానోపాధ్యాయురాలు కాంతికుమారితో మిగతా ఇద్దరు ఉపాధ్యాయుల మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయని తెలిసింది. ఈ క్రమంలోనే అవకాశం దొరకడంతో ఆమెపై దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటనపై విద్యా శాఖ అధికారి (Education Officer) నరేశ్ స్పందించారు. ఈ సంఘటనపై విచారణ ప్రారంభించామని.. ఆ ముగ్గురిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Another spectacular view of #Bihar's education system: Bihta's govt school adjacent to the capital #Patna. In a dispute, the headmaster of the school & a teacher clashed. There was a fight outside in the field as well. The villagers kept making videos… #India#USApic.twitter.com/wE7IAqjS5p