Viral Hack To Make Delicious Multi-Layered Wrap Gets 8.6 Million Views
Wrap: ఈవినింగ్ స్నాక్ ఐటెమ్ కంపల్సరీ.. అందులో డిఫరెంట్‌గా చేస్తే పిల్లలు అయినా సరే.. పెద్దలు అయినా సరే ఇంట్రెస్ట్ చూపిస్తారు. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఫుడ్ ఐటెమ్ వెరైటీకి కొదవలేదు. కింద ఉన్న వ్రాప్ (Wrap) ప్రత్యేకం.. అవును మల్టీపుల్ లేయర్స్‌తో కలిపి చేశారు. మీరు ఓ సారి చూడండి.
వ్రాప్ (Wrap) ఫుడ్‌ను ఇంట్లోనే చక్కగా తయారు చేశారు. రెండు వ్రాప్స్ ఒకదాని మీద ఒకటి పెట్టి, తనకు అనుగుణంగా కట్ చేశాడు. వాటిని తీసి కార్నర్లో అప్పటికే తీసుకున్న ఛీజ్, కార్న్, బ్లాక్ బీన్ సాస్ నలుగు సైడ్లలో పెట్టి మలిచారు. వాటి మధ్యలో ఛీజ్ లాంటిది పెట్టి.. అన్నింటినీ కలిపి పోల్డ్ చేశారు. తర్వాత దానిని ఓవెన్లో పెట్టేశారు. ఇంకేముంది దానిని తీస్తే అద్భుతంగా కనిపించింది. టేస్ట్ కూడా సూపర్ ఉంటుందని పోస్ట్ చేశారు.
ఆ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఇప్పటికే వీడియోను 8.6 మిలియన్ల మంది చూశారు. చాలా మంది నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. సింపుల్‌గా ఉంది.. మల్టీ లేయర్ వ్రాప్ తయారు చేయడం చాలా ఈజీ అంటున్నారు. గ్రే న్యూ ఐడియా అని మరొకరు రాశారు.