»The Son Who Showed The Taj To The Mother On The Stretcher
Viral News : స్ట్రెచర్ మీద ఉన్న తల్లి కోరిక తీర్చిన కొడుకు..!
Viral News : స్ట్రెచర్ మీద కనీసం కదలలేని స్థితిలో ఉన్న తల్లి కోరికను ఓ కొడుకు తీర్చాడు. మంచానికే పరిమితమైన తల్లిని తాజ్ మహల్ చూపించాడు.గుజరాత్ కు చెందిన మహమ్మద్ ఇబ్రహీం అనే వ్యక్తి..తన భార్యతో కలిసి, తల్లి రజియా ను స్ట్రెచర్ పై తీసుకువచ్చి మొత్తాన్ని తిప్పి చూపించారు.
స్ట్రెచర్ మీద కనీసం కదలలేని స్థితిలో ఉన్న తల్లి కోరికను ఓ కొడుకు తీర్చాడు. మంచానికే పరిమితమైన తల్లిని తాజ్ మహల్ చూపించాడు.గుజరాత్ కు చెందిన మహమ్మద్ ఇబ్రహీం అనే వ్యక్తి..తన భార్యతో కలిసి, తల్లి రజియా ను స్ట్రెచర్ పై తీసుకువచ్చి మొత్తాన్ని తిప్పి చూపించారు.
ఇబ్రహీం కుటుంబం గుజరాత్ కచ్ జిల్లాలోని ముంద్రా ప్రాంతంలో నివాసం ఉంటోంది. ఇబ్రహీం తల్లి రజియా..32 సంవత్సరాలుగా మంచానికే పరిమితం అయ్యింది. చాలా ఏళ్లుగా రజియాకు తాజ్ మహల్ చూడాలనే కోరిక ఉంది. ఆ కోరికను కొడుకుకు తెలిపింది. దీంతో తల్లి కోరికను ఎలాగైనా తీర్చాలని ఇబ్రహీం నిర్ణయించుకున్నాడు. తల్లిని స్ట్రెచర్ పై పడుకోబెట్టి..భార్యతో కలిసి ఆగ్రాను సందర్శించాడు.
మా పూర్వీకుల్లో ఒకరు అప్పట్లో ప్రధాన న్యాయమూర్తిగా పని చేసే వారు. ఆయనకు అప్పటి పరిపాలకుడైన జహంగీర్ మరణ శిక్షను విధించాడు. ఆయన సమాధి కూడా ఆగ్రాలోనే ఉంది. ముందుగా మేమంతా కలిసి ఆయన సమాధి వద్దకు వెళ్లాం. అనంతరం ఆయన సమాధికి నివాళులు ఆర్పించాం. ఆ తర్వాత తాజ్ ను చూసేందుకు బయల్దేరాం అంటూ ఇబ్రహీం తెలిపారు.
ఇప్పుడు తన తల్లి కోరిక తీర్చినందుకు చాలా సంతోషంగా ఉందని ఇబ్రహీం తెలిపారు. తన తల్లి కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నట్లు వెల్లడించారు.