ఒక వధువు (bride) తన పెళ్లిలోనే.. ఈ పెళ్లి పైన పూర్తిగా దృష్టి పెట్టకుండా మొబైల్ ఫోన్ లో (mobile phone) మాట్లాడటంతో ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వరుడు వరమాల వేసిన తర్వాత ఆమె అతనిని వదిలేసి, కాస్త పక్కకు జరిగి తన ఫోన్ లో బిజీగా ఉన్న వీడియో ఇది. అంటే తన పెళ్లిలో తన పెళ్లి పైనే ఆమె పూర్తిగా దృష్టి పెట్టలేదని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఈ పెళ్లిలో ఆమె తన వరుడి కంటే ఫోన్ పైన ఎక్కువగా శ్రద్ధ చూపిస్తున్నట్లుగా ఉందని అంటున్నారు.
ఈ వీడియోలో సదరు వధువు పూర్తిగా వివాహ దుస్తుల్లో కనిపించింది. కానీ ఓ సమయంలో ఆమె తన బంధువులు లేదా వరుడితో మాట్లాడటం కంటే ఫోన్ కాల్ లో మాట్లాడటంకనిపించింది. వరుడు, కుటుంబ సభ్యులు ఫోటోలు దిగుతున్న సమయంలో ఆమె మాత్రం ఎవరితోనే ఫోన్లో మాట్లాడుతున్నారు. కొంతమంది బంధువులు తమతో కలిసి ఫోటో దిగాలని అడిగినప్పుడు ఆమె సరే చేత్తో సైగ చేస్తూనే మళ్లీ తన మొబైల్ ఫోన్ లో మునిగిపోయింది. ఈ వీడియో ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేయగా, వేలాది మంది చూశారు. దీనిని ట్విట్టీ వెడ్డింగ్ అనే ఇన్ స్టాలో అప్ లోడ్ చేశారు. కొన్ని సమయాల్లో అన్నింటి కంటే ఫోన్ చాలా ముఖ్యం అని కాప్షన్ పెట్టారు.