Teachers Arrest : విద్యార్థులతో ఆ పని..ఆరుగురు లేడీ టీచర్లు అరెస్ట్
విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సిన టీచర్లు చేయకూడని పని చేశారు. విద్యార్థులతో శారీరక సంబంధాలు పెట్టుకున్నారనే ఆరోపణల నేపథ్యంలో పోలీసులు ఆరుగురు లేడీ టీచర్లను అరెస్ట్ చేశారు.
సమాజంలో రోజురోజుకూ అత్యాచారాలు, లైంగిక వేధింపులు పెరిగిపోతున్నాయి. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా మార్పు రావడం లేదు. సమాజంలో ఎక్కడో ఒక చోట దారుణ ఘటనలు వెలుగుచూస్తేనే ఉన్నాయి. తాజాగా విద్యార్థులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణపై ఆరుగురు లేడీ టీచర్ల(Lady Teachers)ను అరెస్ట్(Arrest) చేశారు. ఈ దారుణ సంఘటన అమెరికాలోని కెంటకీ రాష్ట్రంలోని డాన్విల్లే ప్రాంతంలో చోటుచేసుకుంది.
ఎలెన్ షెల్ అనే టీచర్‌పై థర్డ్ డిగ్రీ అత్యాచారం చేసినట్లు కేసు(Case File) నమోదైంది. షెల్ తో పాటు మరో ఇద్దరు టీచర్లు 16 ఏళ్ల అబ్బాయిలతో లైంగిక చర్యలకు పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే అర్కాన్సాస్ కు చెందిన మరో మహిళా టీచర్ హీథర్ హరే ఫస్ట్ డిగ్రీ అత్యాచారం కేసులో అరెస్ట్(Arrest) అయ్యారు. టీనేజ్ విద్యార్థి(Student)తో ఆమె లైంగిక సంబంధం పెట్టుకున్నట్లు ఆరోపణలున్నాయి.
ఎమిలే హన్ కాక్ అనే మరో లేడీ టీచర్(Lady Teacher) తాను చదువు చెప్పే విద్యార్థితో శారీరక సంబంధం పెట్టుకుందనే ఆరోపణపై పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. తరగతి గదినే పడక గదిగా మార్చుకుని ఆమె ఇటువంటి చర్యలకు పాల్పడినట్లు ఆధారాలున్నాయని పోలీసులు తెలిపారు. అలాగే ఇంగ్లీష్ టీచర్ అయిన క్రిస్టెన్ గాంట్ అనే టీచర్ టీనేజ్ విద్యార్థితో శారీరక సంబంధం పెట్టుకుందని అరెస్ట్ చేశారు. మరో హైస్కూల్ లో ఖేరద్ మాండ్ అనే టీచర్ కూడా ఇటువంటి ఆరోపణల నేపథ్యంలో అరెస్ట్(Arrest) అయ్యారు.
జావెలిన్ త్రో కోచ్ హన్నా మార్త్ తన వద్ద శిక్షణ తీసుకునే విద్యార్థితో శారీరక సంబంధం పెట్టుకుందనే కేసులో పోలీసులు ఆమెను అరెస్ట్(Arrest) చేశారు. పాఠాలు చెప్పాల్సిన వీరు విద్యార్థుల జీవితాలను నాశనం చేశారని, ఇలాంటి టీచర్ల వల్ల సమాజం నాశనం అవుతోందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లల తల్లిదండ్రులు ఇకనైనా అప్రమత్తంగా ఉండాలని పోలీసులు కోరారు.