EX MLA Neeraja Reddy : మాజీ ఎమ్మెల్యే నీరజారెడ్డి దుర్మరణం
కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ(Alur Constituency) మాజీ ఎమ్మెల్యే నీరజారెడ్డి(EX MLA Neeraja Reddy) దుర్మరణం చెందారు. కారు టైరు పేలిన ఘటనలో ఆమె చికిత్స పొందుతూ మరణించారు.
ఏపీ మాజీ ఎమ్మెల్యే నీరజారెడ్డి(EX MLA Neeraja Reddy) ఆదివారం దుర్మరణం(Died) చెందారు. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ(Alur Constituency) మాజీ ఎమ్మెల్యే అయిన నీరజారెడ్డి ఓ ప్రమాదంలో ప్రాణాలు విడిచారు. నీరజా రెడ్డి హైదరాబాద్ నుంచి కర్నూలుకు కారు వస్తుండగా ఈ ప్రమాదం(Car Accident) జరిగింది. మార్గం మధ్యలో కారు టైరు పేలిపోవడంతో ప్రమాదం జరిగింది. కారు బోల్తా పడటంతో అందులోని నీరజారెడ్డి మరణించారు. ఈ సంఘటన బీచుపల్లి వద్ద చోటుచేసుకుంది.
ఫార్చూన్ వాహనంలో వేగంగా రావడం వల్ల కారు పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదం(Accident)లో కారు నుజ్జునుజ్జయ్యింది. స్థానికులు నీరజా రెడ్డి (Neeraja Reddy)ని కర్నూలులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి వైద్యం అందించారు. అయితే అప్పటికే నీరజారెడ్డి తల, శరీర భాగాలకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె అక్కడే తుది శ్వాస విడిచారు.
నీరజారెడ్డి(EX MLA Neeraja Reddy) అలూరు బీజేపీ ఇన్ఛార్జ్గా ప్రస్తుతం పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గతంలో నీరజారెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉండి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2009లో ఆమె ఆలూరు నియోజకవర్గం(Alur Constituency) నుంచి పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత రెండేళ్లకే ఆమె ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్(Congress) పార్టీ నుంచి బయటకు వచ్చేశారు. 2019లో వైసీపీ(YCP)లో చేరిన నీరజారెడ్డి అక్కడ కూడా ఎక్కువ కాలం కొనసాగలేదు. ప్రస్తుతం బీజేపీ(BJP)లో చేరి పార్టీ కార్యక్రమాలు చూస్తున్నారు. నీరజారెడ్డి భర్త పాటిల్ శేషిరెడ్డి కూడా గతంలో పత్తికొండ ఎమ్మెల్యేగా గెలిచిన సంగతి తెలిసిందే.