మాజీ ఎంపీ వైఎస్ వివేకానంద రెడ్డి(Ys Vivekaananda Reddy) హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ హత్య కేసులో ఎంపీ అవినాశ్ రెడ్డి(Avinash Reddy) తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి(YS Bhaskar Reddy)ని సీబీఐ(CBI) అధికారులు ఆదివారం ఉదయం అరెస్ట్(Arrest) చేశారు. మధ్యాహ్నం పులివెందుల నుంచి వైఎస్ భాస్కర్ రెడ్డిని హైదరాబాద్ లోని సీబీఐ కార్యాలయానికి తీసుకొచ్చారు. వైద్య పరీక్షల నిమిత్తం ఆయన్ని ఉస్మానియా ఆస్పత్రి(Usmania Hospital)కి తరలించి వైద్య పరీక్షలు చేయించారు.
వైఎస్ భాస్కర్ రెడ్డి(Ys Vivekaananda Reddy)కి వైద్య పరీక్షలు చేయించిన తర్వాత సీబీఐ(CBI) అధికారులు ఆయన్ని న్యాయమూర్తి నివాసానికి తీసుకెళ్లారు. సీబీఐ జడ్జి ఎదుట హాజరు పరిచాక వైద్య పరీక్షల నివేదికను జడ్డికి అందజేశారు. వివరాలన్నింటినీ న్యాయమూర్తి పరిశీలించారు. ఈ నేపథ్యంలో వైఎస్ భాస్కర్ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌ను న్యాయమూర్తి విధించారు.
ఏప్రిల్ 29వ తేది వరకూ వైఎస్ భాస్కర్ రెడ్డి(Ys Vivekaananda Reddy)కి రిమాండ్ విధిస్తున్నట్లు సీబీఐ జడ్జి ఉత్తర్వులు ఇచ్చారు. అనంతరం సీబీఐ అధికారులు వైఎస్.భాస్కర్ రెడ్డిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఈ సందర్భంగా భాస్కర్ రెడ్డి లాయర్ మీడియాలో మాట్లాడుతూ కొన్ని విషయాలను తెలిపారు. వైఎస్ భాస్కర్ రెడ్డి(Ys Vivekaananda Reddy) ఆరోగ్యం బాగోలేదని, జైలు సూపరింటెండెంట్ కు జడ్జి జాగ్రత్తగా చూసుకోమని తెలిపారన్నారు. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు త్వరలోనే మీడియా ముందు ఉంచుతామన్నారు.