»Shocking Viral Video Shows Man Forcibly Kissing Woman
viral video: మహిళను బలవంతంగా ముద్దు పెడుతున్న సీరియల్ కిస్సర్!
ఓ మహిళను ఓ యువకుడు బహిరంగంగానే బలవంతంగా ముద్దు పెడుతున్న వీడియో (Video) నెట్టింట వైరల్ గా మారింది. ఈ సంఘటన బీహార్ లో (Bihar) చోటు చేసుకున్నది. జాముయ్ ప్రాంతంలో ఓ మహిళ ఫోన్ (Woman on phone) మాట్లాడుకుంటూ నిలబడింది. ఈ సమయంలో ఈ అనుకోని ఘటన జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో అక్కడి సీసీటీవీ ఫుటేజీలో నిక్షిప్తమైంది.
ఓ మహిళను ఓ యువకుడు బహిరంగంగానే బలవంతంగా ముద్దు పెడుతున్న వీడియో (Video) నెట్టింట వైరల్ గా మారింది. ఈ సంఘటన బీహార్ లో (Bihar) చోటు చేసుకున్నది. జాముయ్ ప్రాంతంలో ఓ మహిళ ఫోన్ (Woman on phone) మాట్లాడుకుంటూ నిలబడింది. ఈ సమయంలో ఈ అనుకోని ఘటన జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో అక్కడి సీసీటీవీ ఫుటేజీలో నిక్షిప్తమైంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు నిందితుడిని అరెస్టు చేయాలని, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
బీహార్ లో సీరియల్ కిస్సర్ (serial kisser) హల్ చల్ చేస్తున్నట్లుగా కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. దీనిని నిజం చేస్తూ ఇప్పుడు ఈ వీడియో వెలుగు చూడటం గమనార్హం. ఇది నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేసింది. జాముయ్ జిల్లాలో మహిళా ఆరోగ్య కార్యకర్త ఆరు బయట నిలబడి ఫోన్ మాట్లాడుతోంది. ఆ సమయంలో అక్కడకు వచ్చిన అతను ఆమెకు బలవంతంగా ముద్దు అక్కడి నుండి పారిపోయాడు. అతని నుండి ఆమె తప్పించుకునే ప్రయత్నం చేసింది. కానీ ఏం జరుగుతుందో తెలిసే లోపు ముద్దు పెట్టి వెళ్లిపోయాడు. ఆమె అతనిని నెట్టివేసే ప్రయత్నం చేసినప్పటికీ ఆమె బలం అంతగా సరిపోలేదు. ఆ మహిళ అక్కడి హాస్పిటల్ వెలుపల నిలబడి ఉన్నట్లుగా వీడియోను బట్టి తెలుస్తోంది. ఆమె ఫోర్త్ క్లాస్ హెల్త్ వర్కర్ (health worker). జాముయ్ సర్దార్ హాస్పిటల్ లో పని చేస్తోంది. ఈ పని కోసం అతను హాస్పిటల్ గోడ దూకినట్లుగా కూడా తెలుస్తోంది.
సదరు మహిళ జాముయ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు. వేధింపులకు పాల్పడిన సదరు వ్యక్తి అక్కడి నుండి పారిపోవడంతో పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా విచారణ జరుపుతున్నారు. సదరు వ్యక్తిని సీరియల్ కిస్సర్ గా గుర్తించినట్లు తెలుస్తోంది. అతను హాస్పిటల్ కాంపౌండ్ లోకి ఎందుకు వచ్చాడో తనకు తెలియదని, అతనికి నేను ఏం ఇబ్బంది పెట్టానని, తనను వేధించాడని సదరు మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఘటన తర్వాత ఆమె హాస్పిటల్ సిబ్బందిని పిలిచింది. కానీ అంతలోనే అక్కడి నుండి తప్పించుకున్నాడు.