NTR Fans Fires : ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ ఆడియో క్లిప్ నందమూరి ఫ్యాన్స్‌కు మంట పుట్టేలా చేస్తోంది. అది కూడా రామ్ చరణ్ ఇంటర్వ్యూలో సైడ్ యాక్టర్ అనే ప్రస్థావన వచ్చినట్టు వినిపిస్తున్న ఆడియో క్లిప్ హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరు కూడా మార్చి 12న జరగనున్న ఆస్కార్ ఈవెంట్ కోసం అమెరికాలో ఉన్నారు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ ఆడియో క్లిప్ నందమూరి ఫ్యాన్స్‌కు మంట పుట్టేలా చేస్తోంది. అది కూడా రామ్ చరణ్ ఇంటర్వ్యూలో సైడ్ యాక్టర్ అనే ప్రస్థావన వచ్చినట్టు వినిపిస్తున్న ఆడియో క్లిప్ హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరు కూడా మార్చి 12న జరగనున్న ఆస్కార్ ఈవెంట్ కోసం అమెరికాలో ఉన్నారు. ఈ క్రమంలో అక్కడ పలు ఇంటర్య్యూల్లో పాల్గొంటూ.. ఫ్యాన్స్ మీట్‌తో సందడి చేస్తున్నారు. అందులోభాగంగా ఓ పాడ్ కాస్ట్ షోకు అటెండ్ అయ్యాడు రామ్ చరణ్. ఇందులో చరణ్ పలు ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నాడు. త్వరలోనే హాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు కూడా చెప్పుకొచ్చాడు. అయితే ఫుల్ ఇంటర్య్వూలో చరణ్ ఏమాన్నాడో తెలియదు గానీ.. పాడ్ కాస్ట్ షో హోస్ట్ మాత్రం ఎన్టీఆర్‌ను తక్కువ చేసినట్టు మాట్లాడినట్టు.. ఓ ఆడియో క్లిప్ నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. అయితే అది ఆ షోకి సంబంధించిందేనా.. లేదంటే కావాలనే ఎవరైనా కట్ చేసి పెట్టారో తెలియదు గానీ.. సదరు హోస్ట్ ‘సైడ్ యాక్టర్ ఎన్టీఆర్ జూనియర్’ అంటూ మాట్లాడినట్టు ఆడియోలో వినిపిస్తోంది. కానీ అంతకు ముందు, ఆ తర్వాత ఆడియో మాత్రం లేదు. ఇది ఆడియో క్లిప్ నమ్మశక్యంగా లేకపోయినా.. చరణ్ పాడ్ కాస్ట్ ఇంటర్య్వూలో పాల్గొంది నిజమే కాబట్టి.. దీనిపై తారక్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఎన్టీఆర్‌ని సైడ్ యాక్టర్ అనడం ఏంటని.. ఫైర్ అవుతున్నారు. ఇటీవల హాలీవుడ్ క్రిటిక్ అసోసియేషన్ అందించిన స్పాట్ లైట్ అవార్డ్స్ విషయంలోను చరణ్‌కే అవార్డు వచ్చినట్టు ప్రచారం జరగడంతో.. నందమూరి ఫ్యాన్స్ అప్సెట్ అయ్యారు. ఫైనల్‌గా ఇంటికే అవార్డు పంపిస్తామని స్వయంగా ఎచ్సీఎ క్లారిటీ ఇచ్చింది. ఇక ఇప్పుడు కావాలనే తారక్‌ను తక్కువ చేసినట్టు ఆడియో కట్ చేసి వైరల్ చేస్తున్నారని అంటున్నారు. అయితే ఇదంతా ఫ్యాన్స్ మధ్య జరిగే తతంగం మాత్రమేనని చెప్పొచ్చు. ఆర్ఆర్ఆర్లో ఇద్దరు హీరోలకు గ్లోబల్ స్థాయిలో క్రేజ్ వచ్చింది. ఇప్పుడు ఆస్కార్ బరిలోను ఉన్నారు. కాబట్టి ఆ కోణంలో మెగా, నందమూరి ఆలోచిస్తే బెటర్!