రష్యా లోని ఓ స్కూల్లో దుండగులు కాల్పుల వర్షం కురిపించారు. ఈ ఘటనలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోగా… అందులో ఐదుగురు చిన్నారులు ఉండటం గమనార్హం. మరో 20మందికి పైగా గాయాలపాలయ్యారు. స్కూల్లో కాల్పులకు తెగబడిన దుండగులు.. ఆ తర్వాత ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు.
“స్కూల్లో కాల్పులు జరిపిన వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. నివేదికల ప్రకారం అతను ఆత్మహత్య చేసుకున్నాడు,” అని ఓ అధికారి వెల్లడించారు. అయితే… స్కూల్లో కాల్పులకు తెగబడిన వ్యక్తి ఎవరు? అతను అసలు ఎందుకు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు? అన్న వివరాలు తెలియరాలేదు.