Ram Charan : లాస్ట్ ఇయర్ మార్చి 25న రిలీజ్ అయిన ఆర్ఆర్ఆర్ మూవీ.. ఇంకా సంచనాలు సృష్టిస్తునే ఉంది. ఏడాది లోపే ఆస్కార్ అందుకోవడానికి రెడీ అవుతోంది. ఇప్పటికే ఎన్నో ఇంటర్నేషనల్ అవార్డ్స్ సొంతం చేసుకుంది ఆర్ఆర్ఆర్. అంతేకాదు హాలీవుడ్ దర్శక దిగ్గజాలు జేమ్స్ కామెరాన్, స్పీల్ బర్గ్ సైతం రాజమౌళి మేకింగ్‌కు ఫిదా అయిపోయారు.
లాస్ట్ ఇయర్ మార్చి 25న రిలీజ్ అయిన ఆర్ఆర్ఆర్ మూవీ.. ఇంకా సంచనాలు సృష్టిస్తునే ఉంది. ఏడాది లోపే ఆస్కార్ అందుకోవడానికి రెడీ అవుతోంది. ఇప్పటికే ఎన్నో ఇంటర్నేషనల్ అవార్డ్స్ సొంతం చేసుకుంది ఆర్ఆర్ఆర్. అంతేకాదు హాలీవుడ్ దర్శక దిగ్గజాలు జేమ్స్ కామెరాన్, స్పీల్ బర్గ్ సైతం రాజమౌళి మేకింగ్‌కు ఫిదా అయిపోయారు. అందుకే మరోసారి ఈ సినిమాను భారీ ఎత్తున రీ రిలీజ్ చేశారు. ఈ క్రమంలో.. మార్చి 1న ఆర్ఆర్ఆర్ సినిమాను ప్రపంచంలోనే అతిపెద్ద తెరపై స్పెషల్ స్క్రీనింగ్ చేశారు. అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లోని ఏస్ హోటల్లో.. 1647 సీటింగ్ కెపాసిటీ ఉన్న థియేటర్లో ప్రదర్శించారు. అయితే ఈ సినిమా విడుదలై 342వ రోజున కూడా.. హౌజ్ ఫుల్ అయింది. దాంతో థియేటర్ ఈలలు, అరుపులతో మోత మోగిపోయింది. ముఖ్యంగా నాటు నాటు సాంగ్ ప్లే అవుతున్నప్పుడు థియేటర్ దద్దరిల్లిపోయింది. అంతేకాదు.. అమెరికన్ ఆడియన్స్ ఈసినిమాకు స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. రాజమౌళి, కీరవాణి, రామ్ చరణ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్లోనూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. మీ అందరి నుండి స్టాండింగ్ ఒవేషన్ అందుకోవడం.. నా ఫరెవర్ మెమొరీలలో ఒకటిగా నిలిచిపోతుందని.. ఈ స్పెషల్ స్క్రీన్ పై ఓ బ్యూటిఫుల్ సెల్ఫీని షేర్ చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఇప్పుడే ఇలా ఉంటే.. మార్చి 12న ఆస్కార్ వేదిక పై.. నాటు నాటు లైవ్ పర్ఫార్మెన్స్కు.. రెస్పాన్స్ ఇంకెలా ఉంటుందో ఊహించుకోవచ్చు. మొత్తంగా ఇప్పుడు అమెరికాకు నాటు నాటు ఫీవర్ పట్టుకుందనే చెప్పాలి.