Snake Video: పాములకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవడం చూస్తూనే ఉన్నాం. ఒక్కొక్క సారి ఒళ్లు గగుర్పొడిచే వీడియోలను చూసి షాక్ కూడా అయ్యే ఉంటాం. ప్రతీ సారి పాములు మనుషులను ఇబ్బంది పెట్టే వీడియోలను మాత్రమే చూశాం. ఈ సారి మనుషులు పామును ఇబ్బంది పెట్టే వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది దక్షిణాఫ్రికా నుండి వెలుగులోకి వచ్చింది. కొంతమంది యువకులు ఆరడుగుల పొడవున్న కొండచిలువను మొదట పట్టుకున్నారు. తర్వాత సరదాగా మద్యం సీసా మొత్తం దాని నోట్లో పెట్టి మందు పోయడం ప్రారంభించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
యువకులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేశారు. మందు లాంటి పదార్థాలను జీర్ణం చేసే శక్తి సరీసృపాల అవయవాలకు ఉండదని పాము నిపుణులు అంటున్నారు. కొండచిలువ అంతర్గత అవయవాలు కాలిపోయి ఉండవచ్చు లేదా చనిపోయి ఉండవచ్చని భావిస్తున్నారు. వైరల్‌గా మారిన క్లిప్‌లో యువకులు కొండచిలువను దాని నోటితో క్రూరంగా హింసించడం కనిపించింది. పాము కూడా నిస్సహాయంగా కనిపిస్తోంది. దీని తర్వాత, ముగ్గురు యువకులు కొండచిలువ నోటిలోకి ఒకదాని తర్వాత ఒకటి సీసాల నుండి మద్యం పోయడం కనిపించింది. కేవలం 14 సెకన్ల ఈ క్లిప్ అందరినీ కదిలించింది. ఈ వీడియో బయటకు రావడంతో పోలీసులు గుర్తుతెలియని యువకులపై జంతు హింస కేసు నమోదు చేసి వెతకడం ప్రారంభించారు.
These drunken yobs are being hunted in South Africa for animal cruelty after force-feeding Carling Black Label lager down the throat of a terrified python. pic.twitter.com/1fFBmiRIRd