• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వైరల్ న్యూస్

viral video:వావ్.. బామ్మా: 80 ఏళ్ల వయస్సులో పారా గ్లైడ్

ఏదైనా సాధించాలనే తపన, చేయాలనే ఉత్సాహం ఉంటే చాలు ఏమైనా చేయొచ్చు. ఈ వీడియోలో కనిపిస్తున్న వృద్దురాలు కూడా అంతే. 80 ఏళ్ల వయస్సులో కూడా పారాగ్లైడ్ చేసి, అందరినీ ఆశ్చర్యపరిచారు. తనకు వయస్సు అడ్డంకి కాదని చేతలతో నిరూపించారు. వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా తెగ వైరల్ అవుతుంది. ఆమె ఇప్పుడు మన మధ్య లేరు. వీడియోను మనమరాలు షేర్ చేశారు. ఆ వీడియోను మీరు కూడా చూడండి. ఆ వృద్దురాలి ఏడేళ్ల క్రితమే […]

January 23, 2023 / 01:38 PM IST

రామ్ చరణ్ భార్య ఉపాసన ఇంట విషాదం

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన ఇంట విషాదం నెలకొంది. ఉపాసన నానమ్మ కన్నుమూశారు. తన నానమ్మ తుదిశ్వాస విడిచిన విషయాన్ని ఉపాసన సోషల్ మీడియా ద్వారా తెలిపారు. తన నానమ్మ చివరి వరకూ ఎంతో ప్రేమ, గౌరవంతో నిండిన జీవితాన్ని గడిపారని, జీవితాన్ని ఎలా ముందుకు సాగించాలో ఆమె ద్వారానే  తెలుసుకున్నానన్నారు. ఆమె ప్రేమను ఎప్పటికీ గుర్తించుకునే ఉంటానన్నారు. తన నానమ్మ నుంచి ఎలాంటి అనుభూతులు పొందానో తన పిల్లలకు...

January 23, 2023 / 01:08 PM IST

పంత్ కోసం టీమిండియా క్రికెటర్ల పూజలు

టీమిండియా క్రికెటర్ రిషభ్ పంత్ రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పంత్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. తీవ్రంగా గాయపడిన పంత్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. ఈ తరుణంలో పంత్ త్వరగా కోలుకోవాలని టీమిండియా క్రికెటర్లు ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. క్రికెటర్లు సూర్యకుమార్ యాదవ్, కుల్ దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్ మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని మహాకాళేశ్వర్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. వ...

January 23, 2023 / 11:59 AM IST

జనసేనాని జగిత్యాల పర్యటన రూట్ మ్యాప్ విడుదల

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జగిత్యాల జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన పర్యటన రూమ్ మ్యాప్ విడుదలైంది. మంగళవారం పవన్ కొండగట్టుకు వెళ్లనున్నారు. ఉదయం 11 గంటలకు కొండగట్టుకు చేరుకుని అంజన్న ఆలయంలో ప్రచార రథం వారాహికి ప్రత్యేక పూజలు చేయనున్నారు. పూజా కార్యక్రమాలు అయిన తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు నాచుపల్లి శివారులోని రిసార్టుకి వెళ్లనున్నారు. అక్కడ పార్టీ ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. రాబోవు ...

January 23, 2023 / 09:33 AM IST

25న బాధ్యతలు చేపట్టనున్న న్యూజిలాండ్ కొత్త ప్రధాని

న్యూజిలాండ్ ప్రధానిగా ఉన్న జెసిండా ఆర్డెన్ గురువారం తన పదవికి రాజీనామా చేశారు. ఈ తరుణంలో కొత్త ప్రధానిగా క్రిస్ హిప్ కిన్స్ బాధ్యతలు స్వీకరించనున్నారు. న్యూజిలాండ్ అధికార లేబర్ పార్టీ ప్రతినిధులు ఆదివారం కొత్త ప్రధానిని ఎన్నుకున్నారు. దీంతో ఆ దేశానికి 41 ప్రధానిగా క్రిస్ హిప్ కిన్స్ నిలువనున్నారు. ప్రస్తుతం న్యూజిలాండ్ దేశం అధిక ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొంటోంది. అంతేకాకుండా నిత్యావసర ధరలు కూడా అధ...

January 23, 2023 / 08:51 AM IST

హాకీ వరల్డ్ కప్ లో భారత్ పరాజయం

హాకీ వరల్డ్ కప్ లో భారత్ పరాజయం పాలైంది. భారత్ క్వార్టర్ ఫైనల్స్ కు చేరలేకపోయింది. న్యూజిలాండ్ తో జరిగిన ఈ మ్యాచ్ లో భారత్ ఓటమిపాలైంది. మ్యాచ్ ముగిసే సమయానికి భారత స్కోర్ 3-3తో సమంగానే ఉన్నప్పటికీ పెనాల్టీ షూటవుట్ లో విఫలమైంది. పెనాల్టీ షూటవుట్ లో భారత్ 4-5 తేడాతో ఓడింది. షూటవుట్లో షంషేర్ సింగ్, సుఖ్ జీత్ సింగ్, హర్మన్ ప్రీత్ సింగ్, అభిషేక్ గోల్స్ ను మిస్ చేశారు. దీంతో భారత్ […]

January 23, 2023 / 09:04 AM IST

టీమిండియా మరో విజయం

అండర్ 19 మహిళల టి20 ప్రపంచకప్ లో భారత్ విజయం సాధించింది. అంతకు ముందు ఆస్ట్రేలియా మహిళల జట్టు చేతిలో ఓడిన టీమిండియా తాజాగా శ్రీలంకపై విజయం సాధించింది. ఆదివారం జరిగిన సూపర్ సిక్స్ మ్యాచ్ లో భాగంగా శ్రీలంకతో భారత్ తలపడింది. ఈ పోరులో 7 వికెట్ల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. శ్రీలంక చేసిన 60 పరుగుల లక్ష్యాన్ని 7.2 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ మ్యాచ్ లో సౌమ్య […]

January 22, 2023 / 08:41 PM IST

నేడు ఒకే వరుసలోకి చంద్రుడు, శుక్రుడు, శని గ్రహాలు

ఆకాశంలో నేడు అద్భుత ఘట్టం జరగనుంది. ఆదివారం రాత్రి అంతరిక్షంలో చంద్రుడు, శుక్రుడు, శని గ్రహాలు ఒకే వరుసలోకి వస్తాయి. కొన్నిరోజులుగా శుక్ర, శని గ్రహాలు పరస్పర సమీపానికి చేరాయి. జనవరి 22వ తేదికి 0.4 డిగ్రీల కోణంలో ఈ గ్రహాలు ఒకదానికొకటి చేరువవ్వనున్నాయి. అత్యంత కాంతివంతమైన శుక్ర గ్రహం ప్రస్తుతం 3.9 మాగ్నిట్యూడ్ తో కాంతులీనుతోంది. శనిగ్రహం 0.7 మాగ్నిట్యూడ్ తో మసకబారనుంది. ఇప్పుడు ఈ రెండూ కూడా మకరరా...

January 22, 2023 / 07:28 PM IST

చైనాలో బీఎఫ్7 వ్యాప్తి..వారంలో 13 వేల మరణాలు

చైనాలో కరోనా మహమ్మారి కొత్త సబ్ వేరియంట్ ఒమిక్రాన్ బీఎఫ్-7 విజృంభిస్తోంది.  ఇటీవల లాక్ డౌన్ ఎత్తివేయడంతో అత్యధిక స్థాయిలో ఇన్ఫెక్షన్ రేటు నమోదైందని అధికారులు తెలిపారు. చైనా వ్యాక్సిన్ల పనితీరుపై సందేహాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో చైనాలో కరోనా మరణాలు తీవ్ర స్థాయిలో నమోదవుతున్నాయి. గత వారం రోజుల్లో చైనాలో 13 మంది కరోనాతో మృత్యువాత పడినట్లు తేలింది. చైనాలో లాక్ డౌన్ ఎత్తివేసిన అనంతరం జనవరి 12వ తేది వరక...

January 22, 2023 / 06:30 PM IST

ప్రేమించడమే పాపం అయ్యింది..అమానుష ఘటన

ఖమ్మం జిల్లాలోని మండాలపాడులో ఓ అమానుష ఘటన చోటుచేసుకుంది. ఓ ప్రేమ జంట కులాంతర వివాహం చేసుకుందని, వారిని కుల బహిష్కరణ చేశారు కులపెద్దలు. కులాలు వేరైనా తల్లిదండ్రులను ఒప్పించి యువతి, యువకుడు పెళ్లి చేసుకున్నారు. వారి ప్రేమ పెళ్లికి ఇరు కుటుంబాల నుంచి ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ అమ్మాయికి సంబంధించిన కుల పెద్దలు యువతి కుటుంబాన్ని వెలివేశారు. కులాంతర వివాహం చేసుకున్నందుకు రూ.20 వేల జరిమానా విధించారు. ...

January 22, 2023 / 05:26 PM IST

సింగర్ మంగ్లీ కారుపై రాళ్ల దాడి

టాలీవుడ్ సింగర్ మంగ్లీ కారుపై కర్ణాటకలో రాళ్ల దాడి జరిగింది. బళ్లారి మున్సిపల్ కాలేజీ గ్రౌండ్ లో బళ్లారి ఫెస్టివ్ లో ఆమె పాల్గొంది. ఆ కార్యక్రమంలో పాల్గొని తిరిగొస్తుండగా కొందరు వ్యక్తులు రాళ్ల దాడి చేశారు. ఈ వేడుకకు సీనియర్ యాక్టర్ రాఘవేంద్ర రాజ్ కుమార్, పునీత్ రాజ్ కుమార్ భార్య అశ్విని గెస్టులుగా విచ్చేశారు. మొదటి రోజు కార్యక్రమంలో సింగర్ మంగ్లీతో కలిసి మరికొంత మంది గాయకులు పాల్గొన్నారు. గత క...

January 22, 2023 / 05:16 PM IST

అమెరికాలో కాల్పుల కలకలం..పది మంది మృతి

అగ్రరాజ్యం అమెరికాలో కాల్పుల కలకలం చెలరేగింది. కాలిఫోర్నియాలోని చైనీస్ న్యూ ఇయర్ సందర్భంగా వేడుక జరుగుతోంది. ఆ కార్యక్రమంలో కాల్పులు జరగడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనలో 10 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. ఈ కాల్పుల ఘటనలో చాలా మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం సంఘటనకు గల కారణాలను పోలీసులు తెలుసుకుంటున్నారు. చైనా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో జరుగుతుండగా ...

January 22, 2023 / 04:52 PM IST

వారికి ఏపీ ప్రభుత్వం శుభవార్త ..త్వరలో భారీ నోటిఫికేషన్

ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పేందుకు సిద్ధమవుతోంది. త్వరలోనే భారీ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న 14 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేయాలని నిర్ణయించింది. త్వరలో నోటిఫికేషన్ జారీ చేయడానికి సీఎం జగన్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికార వర్గాల సమాచారం. ఈ నియామక ప్రక్రియలో భాగంగా నిర్వహించే రాత పరీక్షలను ఆన్...

January 22, 2023 / 03:45 PM IST

తమిళనాడు జల్లికట్టులో మరో విషాదం

తమిళనాడు జల్లికట్టులో మరో విషాదం జరిగింది. ధర్మపురిలో జల్లికట్టును వీక్షించేందకు వచ్చిన ఓ బాలుడు మృతిచెందాడు. జల్లికట్టును ను చూసేందుకు గోకుల్ అనే 14 ఏళ్ల బాలుడు తన ఫ్రెండ్స్ తో కలిసి వచ్చాడు. అయితే వేగంగా దూసుకొచ్చిన ఎద్దు గోకుల్ ను కడుపులో పొడిచింది. దీంతో ఆ బాలుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు బాలుడ్ని ఆస్పత్రికి తరలించినా ఉపయోగం లేకుండా పోయింది. అప్పటికే బాలుడు మృతిచెందినట్లు వైద్యులు ...

January 22, 2023 / 03:38 PM IST

భారత్​ లో ‘అవతార్​ 2’ ఆల్​టైమ్ రికార్డ్

హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ తీసిన ‘అవతార్2’ సినిమా రికార్డులు తిరగరాస్తోంది. అవతార్2 ది వే ఆఫ్ వాటర్ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్లను రాబట్టింది. 160 భాషల్లో ఈ సినిమా విడుదలైంది. ఈ సినిమాకు భారత్ లో అద్భుత ఆదరణ లభించింది. ఇండియాలో ఇప్పటి వరకూ ఈ సినిమా రూ.368.2 కోట్ల నెట్ కలెక్షన్స్ ను సాధించింది. దీంతో భారత బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లను రాబట్టినట్లైయ్యి...

January 22, 2023 / 03:21 PM IST