చైనాలో కరోనా మహమ్మారి కొత్త సబ్ వేరియంట్ ఒమిక్రాన్ బీఎఫ్-7 విజృంభిస్తోంది. ఇటీవల లాక్ డౌన్ ఎత్తివేయడంతో అత్యధిక స్థాయిలో ఇన్ఫెక్షన్ రేటు నమోదైందని అధికారులు తెలిపారు. చైనా వ్యాక్సిన్ల పనితీరుపై సందేహాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో చైనాలో కరోనా మరణాలు తీవ్ర స్థాయిలో నమోదవుతున్నాయి. గత వారం రోజుల్లో చైనాలో 13 మంది కరోనాతో మృత్యువాత పడినట్లు తేలింది.
చైనాలో లాక్ డౌన్ ఎత్తివేసిన అనంతరం జనవరి 12వ తేది వరకు 60 వేల మంది చనిపోయారు. ఈ వారం రోజుల్లో భారీస్థాయిలో కరోనా బాధితులు మరణించడంతో చైనా అధికార వర్గాలను టెన్షన్ పెట్టిస్తోంది. చైనా నూతన సంవత్సర వేడుకల కోసం చాలామంది సొంత ఊర్లకు వెళ్లారని, దాంతో కరోనా తీవ్రస్థాయిలో వ్యాపించే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.