ఖమ్మం జిల్లాలోని మండాలపాడులో ఓ అమానుష ఘటన చోటుచేసుకుంది. ఓ ప్రేమ జంట కులాంతర వివాహం చేసుకుందని, వారిని కుల బహిష్కరణ చేశారు కులపెద్దలు. కులాలు వేరైనా తల్లిదండ్రులను ఒప్పించి యువతి, యువకుడు పెళ్లి చేసుకున్నారు. వారి ప్రేమ పెళ్లికి ఇరు కుటుంబాల నుంచి ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ అమ్మాయికి సంబంధించిన కుల పెద్దలు యువతి కుటుంబాన్ని వెలివేశారు. కులాంతర వివాహం చేసుకున్నందుకు రూ.20 వేల జరిమానా విధించారు. అంతేకాదు వారితో ఎవరు మాట్లాడినా, శుభకార్యాలకు పిలిచినా జరిమానా విధిస్తామని తీర్మానం చేశారు. తమ కుటుంబాన్ని వెలివేసిన కుల సంఘం పెద్దలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధిత కుటుంబంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.