ఏదైనా సాధించాలనే తపన, చేయాలనే ఉత్సాహం ఉంటే చాలు ఏమైనా చేయొచ్చు. ఈ వీడియోలో కనిపిస్తున్న వృద్దురాలు కూడా అంతే. 80 ఏళ్ల వయస్సులో కూడా పారాగ్లైడ్ చేసి, అందరినీ ఆశ్చర్యపరిచారు. తనకు వయస్సు అడ్డంకి కాదని చేతలతో నిరూపించారు. వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా తెగ వైరల్ అవుతుంది. ఆమె ఇప్పుడు మన మధ్య లేరు. వీడియోను మనమరాలు షేర్ చేశారు. ఆ వీడియోను మీరు కూడా చూడండి.
ఆ వృద్దురాలి ఏడేళ్ల క్రితమే చనిపోయారు. వీడియోను ఆమె మనమరాలు సెలినా మోసెస్ షేర్ చేశారు. ‘వయస్సు అనే ఒక నంబర్ మాత్రమే, దీనిని తన అమ్మమ్మ రుజువు చేశారు. 80 ఏళ్ల వయసులో పారా గ్లైడ్ చేశారు. చాలా రోజుల తర్వాత తన గ్యాలరీలో ఈ వీడియో చూశాను. అప్పటినుంచి అందరికీ షేర్ చేస్తున్నాను. అమ్మమ్మ మా నుంచి భౌతికంగా దూరమయ్యారే తప్ప మా మనసులో ఎప్పటికీ నిలిచిపోతారు. వి మిస్ యూ, లవ్ యూ, అమ్మమ్మ’ అని రాసుకొచ్చారు.
ఈ వీడియోకు ఇప్పటికే 4 మిలియన్ లైక్స్ వచ్చాయి. మనకు నచ్చింది చేయడానికి, జీవితం పరిపూర్ణం అయ్యేందుకు వయస్సు అడ్డుకాకుడదని గుర్తుచేశారు. వీడియోకు చాలా మంది నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఓ మై గాడ్, చాలా బాగుంది అని ఒకరు రాశారు. వీడియో చూసి ధైర్యం, శక్తి, ప్రేరణ కలిగిందని, వీడియో పోస్ట్ చేసిన సెలినాకు ధన్యవాదాలు తెలిపారు. బామ్మ అందరికి స్ఫూర్తిగా నిలుస్తుందని మరొకరు అన్నారు. చాలా మంది తమకు స్ఫూర్తి కలిగిస్తోందని అభిప్రాయపడ్డారు. బామ్మ ధైర్య సాహసాలను కొనియాడారు.