ఆకాశంలో నేడు అద్భుత ఘట్టం జరగనుంది. ఆదివారం రాత్రి అంతరిక్షంలో చంద్రుడు, శుక్రుడు, శని గ్రహాలు ఒకే వరుసలోకి వస్తాయి. కొన్నిరోజులుగా శుక్ర, శని గ్రహాలు పరస్పర సమీపానికి చేరాయి. జనవరి 22వ తేదికి 0.4 డిగ్రీల కోణంలో ఈ గ్రహాలు ఒకదానికొకటి చేరువవ్వనున్నాయి.
అత్యంత కాంతివంతమైన శుక్ర గ్రహం ప్రస్తుతం 3.9 మాగ్నిట్యూడ్ తో కాంతులీనుతోంది. శనిగ్రహం 0.7 మాగ్నిట్యూడ్ తో మసకబారనుంది. ఇప్పుడు ఈ రెండూ కూడా మకరరాశిలోకి వెళ్లనున్నాయి. దీనినే గ్రహ సంయోగంగా చెబుతారు. ఈ రోజురాత్రి 8 గంటల వరకూ చంద్రుడికి సమీపంలో ఈ గ్రహ సంయోగం కనువిందు కలిగించనుంది. దీనిని టెలీస్కోప్, బైనాక్యులర్స్ సాయంతో వీక్షించవచ్చని పరిశోధకులు తెలిపారు.