తమిళనాడు జల్లికట్టులో మరో విషాదం జరిగింది. ధర్మపురిలో జల్లికట్టును వీక్షించేందకు వచ్చిన ఓ బాలుడు మృతిచెందాడు. జల్లికట్టును ను చూసేందుకు గోకుల్ అనే 14 ఏళ్ల బాలుడు తన ఫ్రెండ్స్ తో కలిసి వచ్చాడు. అయితే వేగంగా దూసుకొచ్చిన ఎద్దు గోకుల్ ను కడుపులో పొడిచింది. దీంతో ఆ బాలుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు బాలుడ్ని ఆస్పత్రికి తరలించినా ఉపయోగం లేకుండా పోయింది. అప్పటికే బాలుడు మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
బాలుడి వద్దకు ఎద్దు ఎలా వచ్చిందనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. జల్లికట్టు సీసీ టీవీ ఫుటేజీని పరిశీలించనున్నారు. పొంగల్ పండగ సందర్భంగా తమిళనాడులో జల్లికట్టు నిర్వహించడం ఆనవాయతీగా వస్తోంది. అయితే ఈ ఏడాది ఈ జల్లికట్టు వల్ల ఇప్పటికే అరవింద్ రాజ్, శివకుమార్, కలైముట్టి గణేశన్ తో సహా ఇద్దరు ప్రేక్షకులు ఎద్దుల దాడిలో మరణించారు. తాజాగా గోకుల్ అనే బాలుడు మృతిచెందడంతో ఆ సంఖ్య ఇప్పుడు ఆరుకు చేరిందని అధికారులు తెలిపారు.