అండర్ 19 మహిళల టి20 ప్రపంచకప్ లో భారత్ విజయం సాధించింది. అంతకు ముందు ఆస్ట్రేలియా మహిళల జట్టు చేతిలో ఓడిన టీమిండియా తాజాగా శ్రీలంకపై విజయం సాధించింది. ఆదివారం జరిగిన సూపర్ సిక్స్ మ్యాచ్ లో భాగంగా శ్రీలంకతో భారత్ తలపడింది. ఈ పోరులో 7 వికెట్ల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. శ్రీలంక చేసిన 60 పరుగుల లక్ష్యాన్ని 7.2 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
ఈ మ్యాచ్ లో సౌమ్య తివారి 15 బంతుల్లో 28 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచింది. ఈ మ్యాచ్ లో విజయం సాధించడంతో భారత్ సెమీస్ ఆశలు సజీవంగా నిలుపుకున్నట్లైంది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన మహిళల శ్రీలంక జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లకు 59 పరుగులు చేసింది. భారత బౌలర్లలో పర్షవి చోప్రా 4 వికెట్లు తీసింది. మన్నత్ కశ్యప్ 2 వికెట్లు తీసింది. సాధు, అర్చన దేవిలు ఒక్కో వికెట్ ను తీశారు.