సూపర్ స్టార్ మహేష్ బాబు స్టార్ డమ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాగే మహేష్ ఫ్యాన్స్ రచ్చ ఎలా ఉంటుందో చూస్తునే ఉన్నాం.. కానీ ఓ విషయంలో మాత్రం మహేష్ ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. మామూలుగానే స్టార్ హీరోల అభిమానుల తాకిడిని తట్టుకోవడం కష్టం. సినిమాల అప్డేట్ వచ్చినా.. సినిమాలు రిలీజ్ అయినా.. తమ హీరో ఏదైనా గొప్ప పని చేసిన గాల్లో తేలిపోతుంటారు. అందుకు ఘట్టమనేని అభిమానులు కూడా అతీతం కాదు. ఇటీవలె మహేష్ బర్త్ డే సందర్భంగా పోకిరి, ఒక్కడు సినిమాల స్పెషల్ షోస్ వేసి రికార్డులు క్రియేట్ చేశారు. అలాంటి అభిమానులు ఇప్పుడు మహేష్ చేసిన ఓ పనికి ఏం చేయాలో తెలియడం లేదంటున్నారు. ఇటీవల మహేష్ బాబు ఓ ప్రముఖ ఛానెల్ డాన్స్ షో కోసం కూతురు సితారతో కలిసి గెస్ట్‌గా వెళ్లిన సంగతి తెలిసిందే. అందుకోసం మహేష్‌కు భారీ పారితోషికం ఇచ్చినట్టు టాక్.
అయితే ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నా.. అదే చానెల్లో రానున్న ఓ సీరియల్‌ను ప్రమోట్ చేశాడు మహేష్. అందులో కూడా సితారతో కలిసి కనిపించాడు మహేష్. ఊహించని విధంగా మహేష్‌ను సీరియల్స్‌లో చూసి తట్టుకోలేకపోతున్నారు ఫ్యాన్స్. అసలు సూపర్ స్టార్ రేంజ్ ఏంటి.. సీరియల్స్‌లో కనిపించడమేంటని.. తెగ బాధపడిపోతున్నారు. అంతేకాదు సదరు చానెల్‌తో పాటు మహేష్ పై మండిపడుతూ.. మహేష్‌ను ఇలాంటివి చేయకూడదని అంటున్నారు. అయితే ఇక్కడే ఓ విషయం మర్చి పోతున్నారు అభిమానులు. కమర్షియల్‌గా వచ్చే సంపాదనను పలు సేవా కార్యక్రమాల కోసం ఖర్చు చేస్తున్నాడు మహేష్. అందుకే యాడ్స్ చేస్తున్నాడు. కాబట్టి మహేష్ ఏది చేసినా ఫ్యాన్స్ కోసమేనని చెప్పొచ్చు.