»Karnataka Congress Worker Showering Money On Dancer Goes Viral
Dancerపై డబ్బులు వెదజల్లిన నేత.. ఎక్కడంటే?
Showering money on dancer:పెళ్లిలో (marriage) బరాత్ అంటే మాములుగా ఉండదు. పిల్ల, పెద్ద అనే తేడా లేకుండా డ్యాన్స్ (dance) చేస్తుంటారు. కొందరు మద్యం మత్తులో జోష్గా ఉంటారు. పాడి, ఆడుతుంటారు. కర్ణాటకలో (karnataka) ఓ కాంగ్రెస్ కార్యకర్త (congress worker) ఇలానే చేశాడు. పెళ్లికి (marriage) హాజరై.. డ్యాన్స్ చేసే ఓ అమ్మాయి డబ్బులు వెదజల్లాడు.
Karnataka Congress worker showering money on dancer goes viral
Showering money on dancer:పెళ్లిలో (marriage) బరాత్ అంటే మాములుగా ఉండదు. పిల్ల, పెద్ద అనే తేడా లేకుండా డ్యాన్స్ (dance) చేస్తుంటారు. కొందరు మద్యం మత్తులో జోష్గా ఉంటారు. పాడి, ఆడుతుంటారు. కర్ణాటకలో (karnataka) ఓ కాంగ్రెస్ కార్యకర్త (congress worker) ఇలానే చేశాడు. పెళ్లికి (marriage) హాజరై.. డ్యాన్స్ చేసే ఓ అమ్మాయి డబ్బులు వెదజల్లాడు. దానిని వీడియో తీసి సోషల్ మీడియాలో (social media) షేర్ చేయడంతో వైరల్ అవుతుంది.
కర్ణాటకలో గల ధార్వాడ్లో పెళ్లికి ముందు హల్దీ (haldi) కార్యక్రమం జరుగుతుంది. అక్కడ హుబ్లికి చెందిన శివశంకర్ హంపన్న (shivashankar) అనే వ్యక్తి యువతిపై డబ్బులను (money) వెదజల్లాడు. వీడియో షేర్ చేయడంతో.. బీజేపీ స్పందించింది. ‘ఇదీ సిగ్గుచేటు.. ఓ యువతి (girl) డ్యాన్స్ చేస్తుండగా డబ్బులను అలా వెదజల్లుతారా? వీరికి మనీ అంటే విలువే లేదు. దీంతో కాంగ్రెస్ పార్టీ (congress) కల్చర్ ఇదీ అని అర్థం అవుతుంది. ఇప్పుడే కాదు చాలా సార్లు ఇలాంటి ఘటనలు చూశాం. ఘటనను ఖండిస్తున్నా.. కాంగ్రెస్ హైకమాండ్ (congress high command) కూడా దీనిని పరిగణలోకి తీసుకోవాలి’ అని కర్ణాటక బీజేపీ జనరల్ సెక్రటరీ మహేశ్ అన్నారు.
‘ఆ యువతికి కాంగ్రెస్ నేత (congress leader) ఏ విధంగా మర్యాద ఇస్తున్నాడో తెలుస్తోంది. ఇలాంటి సంస్కృతి ఒక్క కాంగ్రెస్ పార్టీలోనే (congress) ఉంటుంది. దీని గురించి కాంగ్రెస్ పార్టే వివరించాలి. రాజకీయ నేత ఇలా ప్రవర్తించడం తగదు. ఆ కాంగ్రెస్ నేత వెంటనే సదరు యువతికి క్షమాపణ చెప్పాలి. ఈ ఘటన మహిళలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చే గౌరవాన్ని తెలియజేస్తోంది’ అని బీజేపీ అధికార ప్రతినిధి రవి నాయక్ అన్నారు. నిజమే.. మహిళలు అంటే ఇలా బిహేవ్ చేయొద్దు. వారిని గౌరవించి.. ఇతరులు రెస్పెక్ట్ ఇచ్చేలా చేయాలి. కాంగ్రెస్ పార్టీ నేత చేసిన పని.. ఆ పార్టీని ఇరుకున పెట్టింది. మరీ దీనిపై ఆ పార్టీ ఎలా స్పందిస్తుందో చూడాలీ మరీ.