Isha Ambani: నెట్టింట వైరల్‌గా మారిన ఈషా అంబానీ వజ్రాల బ్లౌజ్
తన తమ్ముడి ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో ఈషా అంబానీ ధరించిన బ్లౌజ్ గురించి ఇప్పుడు నెట్టింట్లో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆ బ్లౌజ్‌ని తాను బంగారం, వజ్రాలు, రత్నాలు పొదిగి స్వయంగా డిజైన్ చేయించుకోవడం విశేషం.
Isha Ambani : భారత దేశంలోనే సంపన్నులైన ముకేశ్ అంబానీ ఇంట పెళ్లి వేడుకలంటే మామూలుగా ఉండవు కదా మరి. అందుకనే అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ల ప్రీ వెడ్డింగ్ వేడుకల్ని అంతా ఎంతో క్రేజ్‌తో వీక్షించారు. ఆ వేడుకల్లో ఈషా అంబానీ(Isha Ambani) ధరించిన వజ్రాలు, రత్నాలు, బంగారంతో తయారు చేసిన బ్లౌజ్ ఇప్పుడు టాకాఫ్ ద టౌన్ అన్నట్లు తయారైంది. ఈషా దగ్గర ఉన్న కొన్ని రకాల రత్నాలు, లాకెట్లు, పెండెంట్లు, వజ్రాల్లాంటి వాటన్నింటినీ పొదిగి బంగారు జరీతో ఆ బ్లౌన్ని తయారు చేశారు.
దుస్తుల్ని ఎంచుకోవడంలో ఈషా అంబానీ ఎప్పుడూ తనదైన ప్రత్యేకతను చాటుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో ఈ బంగారు బ్లౌజ్‌ను డిజైనర్లు అబుజానీ, సందీప్ ఖోస్లాలతో దీన్ని డిజైన్ చేయించుకున్నారు. గోల్డెన్ జరీతో ఎంబ్రాయడరీ చేసిన ఎరుపు రంగు భారీ లెహంగాపై ఈ వజ్రాలు( Diamonds), రత్నాలు, బంగారంతో తయారు చేసిన బ్లౌజ్‌ని పెయిర్ చేసుకుని సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు.
ఈ బ్లౌజ్ తయారీలో వాడిన వజ్రాలు, రత్నాల్లాంటివి చాలా వరకు ఈషా వద్ద ఉన్నవేనట. కొన్నింటిని మాత్రం రాజస్థాన్, గుజరాత్ల నుంచి తెప్పించారట. బ్లౌజ్‌కి పోల్కీ, రూబీ, వజ్రాలు, పచ్చలు, కెంపుల్లాంటి వాటన్నింటినీ వాడారు. గోల్డ్, సిల్వర్ జర్దోసీ వర్క్‌లో ఈ విలువైన ఆభరణాలను పొదుగుతూ బ్లౌజ్‌కి సరికొత్త లుక్ తీసుకొచ్చారు. దీంతో ప్రస్తుతం ఈ బ్లౌజ్‌తో ఉన్న ఈషా ఫోటోలు, డిజైనింగ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అంబానీ ప్రిన్సెస్ అంటే ఆ మాత్రం ఉంటుంది మరి అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.