»Heavy Rains And Hail Spark Flash Floods In Northern Spain
Spain floods:స్పెయిన్లో వరద విధ్వంసం.. వైరల్ అవుతున్న వీడియోలు
వర్షాలు, వరదల కారణంగా ఇక్కడ బీభత్సం నెలకొంది. చాలా నగరాలు నీట మునిగాయి. ఈశాన్య స్పెయిన్లోని జరాగోజా నగరం పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఇక్కడ రోడ్లపై కార్లు ప్రవహిస్తున్నాయి.
Spain floods:ఈ సమయంలో స్పెయిన్లో పరిస్థితులు బాగా లేవు. వర్షాలు, వరదల కారణంగా ఇక్కడ బీభత్సం నెలకొంది. చాలా నగరాలు నీట మునిగాయి. ఈశాన్య స్పెయిన్లోని జరాగోజా నగరం పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఇక్కడ రోడ్లపై కార్లు ప్రవహిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా ఇక్కడ ఎడతెరిపి లేకుండా వానలు పడుతున్నాయి. దీంతో ఇక్కడ రోడ్లన్నీ నదులయ్యాయి. వరదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. . నీటిలో కారు ప్రవహిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
OMG, these poor people in Northern Spain must have been be so scared, I hope no-one died. The hottest week in recorded history doesn’t mean there isn’t other extreme weather. #ClimateEmergencypic.twitter.com/e1QEErFkDb
అకస్మాత్తుగా వరదలు రావడంతో కొందరు డ్రైవర్లు కూడా తమ కార్లలోనే చిక్కుకుపోయారు. ఈ సమయంలో ప్రజలు ఎక్కడికీ వెళ్లకుండా అక్కడి అధికార యంత్రాంగం నిషేధించింది. ఈశాన్య స్పెయిన్లో ఈరోజు కూడా ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో ఎల్లో అలర్ట్ ప్రకటించారు.
ఈ వర్షం తర్వాత చాలా ప్రాంతాలు వరదల బారిన పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కొన్ని గంటల్లో కురిసిన వర్షాలకు వరదలు వచ్చే పరిస్థితి ఏర్పడిందని చెబుతున్నారు. కొన్ని నెలల క్రితం కూడా వర్షాలు మరియు వరదలు స్పెయిన్లో వినాశనం సృష్టించాయి. అప్పట్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. మే నెలలో వరదల్లో కార్లు కొట్టుకుపోయినట్లు వార్తలు కూడా వచ్చాయి.