»Got A Cool Lip In A Food Parcel At Swiggy In Coimbatore
Swiggy: స్విగ్గి ఫుడ్ పార్శిల్లో కూల్ లిప్
ఆకాలేసిన వెంటేనే ఆన్లలైన్లో ఆర్డర్ పెట్టడం ఇప్పుడు సర్వసాధారణం అయిపోయింది. అలా ఆర్డర్ పెట్టిన ఫుడ్ పార్శిల్లో పెదాల కింద పెట్టుకునే మత్తు పదార్థం దర్శనం ఇచ్చింది. తిన్న బాలికకు వాంతులు, విరేచనాలు అయ్యాయి.
Got a cool lip in a food parcel at Swiggy in Coimbatore
Swiggy: ఆన్ లైన్లో ఆర్డర్ పెట్టిన ఆహారం తిని ఓ బాలిక వాంతులు, విరేచనాలు చేసుకుంది. ఈ సంఘటన చైన్నైలోని కోయంబత్తూరు(Coimbatore)లో చోటుచేసుకుంది. ఉరుకుల పరుగుల జీవితంలో ఏది అందుబాటులో ఉంటే దాన్ని వినియోగించడమే ట్రెండ్‌గా మారింది. అందుకే వీధికి ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్, స్ట్రీట్‌కు ఒక బేకరీలు వేలిశాయి. దీనికి తోడు ఇప్పుడు ఫుడ్ డెలివరీ సంస్థలు కూడా విరివిగా ఏర్పడ్డాయి. ఎలాంటి నాణ్యతాప్రమాణాలు పాటించని అనేక ఆహార సంస్థలు ప్రజల అనారోగ్యానికి కారణం అవుతున్నాయి. తాజాగా కోయంబత్తూరులోని గౌండంపాళ్యంలో జాస్మిన్ అనే మహిళ స్విగ్గీ( Swiggy ) ఫుడ్ డెలివరీ యాప్‌లో తినుబండారాలను ఆర్డర్ చేసింది. డెలివరీ బాయ్ పార్శిల్ తీసుకొచ్చాడు. పార్శిల్ విప్పి ఆహారాన్ని జాస్మిన్ తన కుమార్తెకు అందించింది. ఫుడ్ తిన్న కాసేపటికి బాలికకు వాంతులు, విరేచనాలు అయ్యాయి. అనుమానం వచ్చి ఆహారాన్ని పరిశీలించింది. అందులో రాష్ట్ర ప్రభుత్వం నిషేధించిన కూల్‌లిప్(cool lip) ముక్కలు ఉన్నాయి. కూల్‌లిప్ అనేది ఒక మత్తు పదార్థం. దీన్ని పేదాల కింద పెట్టుకుంటారు. దీంతో అవాక్కైన సదరు మహిళ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. సంస్థపై తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరింది.