»Gigantic Pythons Cuddle With Woman Leaving Netizens Terrified
Viral News: కొండచిలువలను కౌగిలించుకున్న మహిళ.. వైరల్ వీడియో
పాములను చూస్తేనే చాలా మంది ఆమడదూరంలో నిలబడిపోతారు. అలాంటిది ఒక మహిళ ఏకంగా కొండచిలువలనే కౌగిలించుకుంది. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిని ఈ వీడియోను మీరు ఒక లుక్కేయండి.
Gigantic Pythons Cuddle With Woman Leaving Netizens Terrified
Viral News: ఫ్రెండ్లీ కాకపోతే, ఫ్రెండ్ షిప్ ఎందుకు అని సరీసృపాల ప్రేమికులు ఎక్కువగా అంటుంటారు. అందుకే వారు మొసళ్ల(crocodiles) నుంచి పాముల(snakes) వరకు అన్నింటితో స్నేహం చేస్తారు. కానీ కచ్చితంగా మనుషులకు జంతువులకు వ్యత్యాసం ఉంటుందని సామాన్యులు భావిస్తారు. ఈ మాటలను సరీసృపాల ప్రేమికులు ఎక్కువగా నమ్మరు. తాజాగా నెటిజన్లను భయభ్రాంతులకు గురిచేసే ఒక వీడియో ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతోంది. జంతుప్రదర్శనశాలలో పని చేస్తున్న ఓ మహిళ పలు కొండచిలువలను కౌగిలించుకునే వీడియో చేసేవాళ్లకు వెన్నులో వణుకు పుట్టిస్తుంది. వాటితో ఎంతో ప్రేమగా ఆ మహిళా మాట్లాడుతూ కనిపించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ‘ది రెప్టైల్ జూ’(The Reptile Jr)లో ఈ వీడియో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్‌కు పాములు ఇలా కౌగిలించుకోవడం ఇష్టం లేదని, దీనిపై ఒక ఎడ్యుకేషనల్ వీడియో చేద్దామనుకుంటున్నా, కానీ ఈ కొండచిలువలను చూస్తే ముచ్చటేస్తుందని, వీటినుంచి మీరు ఏం కోరుకుంటున్నారు అని రాసుకొచ్చారు. ఈ వీడియోలో కొన్ని భారీ కొండచిలువల మధ్యలో ఒక మహిళా కూర్చొని ఉంది. వాటితో ఆడుతూ ఆ కొండచిలువలను కౌగిలించుకోవడానికి ప్రయత్నిస్తుంది. అలాగే వాటి గురించి నెటిజన్లతో చాలా విషయాలను పంచుకోవాలని అనుకుంటున్నట్లు ఆమె స్పష్టం చేసింది. చూడడానికి భయానకంగా ఉన్నా ఈ వీడియో వైరల్ అయ్యింది. దీంతో తనను ధైర్యవంతురాలిగా అభివర్ణిస్తుండగా.. ఇంకొంత మంది తన భద్రత కోసం ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు. ది రెప్టైల్ జూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్న ఈ వీడియోను ఇప్పటికే 14వేలకు పైగా వీక్షకులు చూశారు.