»Pennsylvania Mummy Stoneman Willie To Be Laid To Rest After 128 Years On Display
Viral News: 128 ఏళ్ల క్రితం మరణించిన వ్యక్తికి ఇప్పుడు అంత్యక్రియలు.. ఎందుకంటే.?
ఒక వ్యక్తి మరణించిన 128 సంవత్సరాల తరువాత అతని అంతిమ సంస్కారాలు చేస్తున్నారు శ్మశాన వాటిక నిర్వాహకులు. అయితే ఇన్ని సంవత్సరాల తరువాత ఎందుకు చేస్తున్నారో తెలిస్తే ఆశ్చర్యపోతారు.
Pennsylvania mummy 'Stoneman Willie' to be laid to rest after 128 years on display
Viral News: దాదాపు శతాబ్ద కాలంగా అంత్యక్రియలు చేయకుండా ఓ మమ్మీ(mummy)ని కాపాడి ఇప్పుడు దహన సంస్కారాలు చేయనున్నారు. 128 సంవత్సరాల క్రితం ఒక ముద్దాయి దొంగతనం కేసులో శిక్ష అనుభవిస్తూ పెన్సెల్వేనియా(Pennsylvania) (America) జైలులో కిడ్నీ విఫలమయై మరణించాడు. అతడి కుటుంబసభ్యులు, సహచరుల వివరాలు అధికారులకు లభించకపోవడంతో అతని మృతదేహాన్ని ఖననం చేయడానికి అక్కడి చట్టం ఒప్పుకోదు. అదే సమయంలో రీడింగ్ నగరంలో ఉన్న ఆమన్స్ శ్మశాన కేంద్రం నిర్వాహకులు ఆ మృతదేహం తమకు కావాలని, మృతదేహాలను ఎక్కువ కాలం పాడవకుండా ఉంచే పరిశోధన (ఎంబామింగ్)లో ఉపయోగిస్తామని కోర్టులో అభ్యర్థించారు. కోర్టు సమ్మతితో ఆ మృతదేహంపై ఎంబామింగ్ విధానం చేపట్టి విజయం సాధించారు.
దాంతో ఇన్ని సంవత్సరాల తరువాత కూడా ఆ శవం పాడవలేదు. దాదాపు 1896 నుంచి సందర్శకులను అలరించింది. ఆ దొంగ ఊరు పేరు తెలియకపోవడంతో రీడింగ్ కేంద్రం నిర్వాహకులు అతడికి స్టోన్‌మ్యాన్ విల్లీ అనే పేరు పెట్టి పిలుచుకునే వారు. దాంతో పాటు అతని కుటుంబం కోసం ఈ శ్మశాన కేంద్రం తీవ్రంగా పరిశోధన చేస్తూనే ఉంది. ఫైనళ్లీ తన వివరాలు తెలుసుకుంది. దాంతో స్టోన్విల్లీ ఖననానికి ఈనెల 7న భారీ ఏర్పాట్లు చేశారు. శవాన్ని ఊరేగింపుగా తీసుకెళ్లి అంతిమ సంస్కారాలు చేయనున్నారు. ఆ సందర్భంగానే అతడి పూర్తి పేరు వివరాలను బహిరంగ పరుస్తామని శ్మశాన కేంద్రం నిర్వాహకులు వెల్లడించారు. స్టోన్విల్లీ డెడ్‌బాడీ ఎంబామింగ్(Embalming) పరిశోధనలో ఎంతో ఉపయోగపడిందని, అందుకే అతను ఎవరో ఈ ప్రపంచానికి తెలియకుండా ఖననం చేయకూడదని నిర్ణయించుకొని, తీవ్రంగా శ్రమించి వారి సంబంధికులను పట్టుకున్నామని, తన చివరి రోజు వాటిని కూడా బహిర్గతం చేస్తామని, ఇదే స్టోన్విల్లీకి ఇచ్చే ఫీజు అని నిర్వాహకులు పేర్కొన్నారు.