duck played పులితో ఆడుకున్న బాతు.. మృగరాజుకు చుక్కలు, వైరల్
duck play:పులి (tiger), సింహాం (lion) అంటే పక్షులు, చిన్న జంతువులకు (animals) హడెల్.. భయపడిపోతాయి. ఇక బాతు (duck), హంస గురించి అయితే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఓ బాతు, పులికి (tiger) చుక్కలు చూపించింది. ఆకలితో ఉందో ఏమో కొలనులోకి అడుగిడింది. ఆ బాతును చూసి.. చంపి తిందామని అనుకుంది. కానీ ఆ బాతు మాత్రం దాగుడు మూతలు ఆడి.. పులికి చుక్కలు చూపించింది.
duck play:పులి (tiger), సింహాం (lion) అంటే పక్షులు, చిన్న జంతువులకు (animals) హడెల్.. భయపడిపోతాయి. ఇక బాతు (duck), హంస గురించి అయితే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కొన్ని సందర్భాల్లో మృగరాజులు కూడా ఇబ్బందులకు గురవుతూ ఉంటాయి. అవును నిజమే.. ఓ బాతు, పులికి (tiger) చుక్కలు చూపించింది. ఆకలితో ఉందో ఏమో కొలనులోకి అడుగిడింది. ఆ బాతును చూసి.. చంపి తిందామని అనుకుంది. కానీ ఆ బాతు మాత్రం దాగుడు మూతలు ఆడి.. పులికి చుక్కలు చూపించింది. సోషల్ మీడియాలో ఆ వీడియో వైరల్ అవుతుంది. మరీ మీరు కూడా ఆ వీడియోను చూడండి.
సిడ్నీ (sydney) సింబియా వైల్డ్ లైఫ్ పార్క్ వద్ద ఈ ఘటన జరిగింది. కొలనులో పులి ఉండగా.. బాతు వచ్చింది. అటు, ఇటు తిరుగుతూ కనిపించింది. దానిని గటుక్కున మింగుదామని అనుకుంది. కానీ పులిని (tiger) ముప్పు తిప్పలు పెట్టింది. ఆ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. బాతు కోసం పులి (tiger) ముందుకు వెళ్లగా.. మునిగి వెనకకు రావడం.. పక్కకు రావడం చేసింది. ఒకటి రెండుసార్లు ట్రై చేసింది. చివరికీ వీలు పడలేదు. దీంతో తాను వెళ్లిపోతున్నా అని చెప్పి.. వెళ్లింది.
వీడియోను (video) కాంపిలేషన్ మాస్టర్ యూ ట్యూబ్ చానెల్లో అప్ లోడ్ చేశారు. ఆ వీడియోను చూసి నెటిజన్లు (netizens) ఎంజాయ్ చేస్తున్నారు. కండ బలం కంటే.. బుద్ది బలం గొప్పదని పెద్ద వారు చెప్పారుగా అంటున్నారు. నిజమే మరీ.. ఆ పులిని చూసి బాతు ఆదరలే.. బెదరలే.. ఏం చక్కా ఆడుకుంది. చివరికీ ఆ పులే బయటకు వచ్చేసింది. వీడియోకు నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు. వామ్మో.. పులినే వణికించావుగా అని ఒకరు.. తెలివితో బాతు దెబ్బ కొట్టిందని మరొకరు అంటున్నారు. నిజమే.. మరీ ఆ వీడియో చూస్తే మీకు కూడా అలాంటి ఫీలింగ్ కలుగుతుంది.