Funny Video: అడ్డంగా దొరికిన కూతురు లవర్.. చీపురు పట్టి చితక్కొట్టిన తల్లి
ఓ యువతి పేరెంట్స్ లేని సమయంలో బాయ్ ఫ్రెండ్ ను ఇంటికి పిలిచి ఎంజాయ్ చేయాలని భావించింది. కానీ తాను అసలు అనుకోలేదు సడన్ గా తల్లిదండ్రులు వస్తారని... దీంతో ఏం చేయాలో అర్థం కాక ఆ అమ్మాయి తన లవర్ ను బాల్కనీ నుంచి దూకి పారిపోమని సజెస్ట్ చేసింది. అందుకు తగిన ఏర్పాట్లు కూడా చేసి పారిపోమంది.
Funny Video: ఈ మధ్య కాలంలో చాలా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిలో కొన్నింటిని చూస్తే నవ్వు ఆపుకోలేము.. కొన్ని చూస్తే అయ్యో అనిపించేలా ఉంటున్నాయి. ఓ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ నెట్టింట్లో నవ్వులు పూయిస్తుంది. ఓ యువతి పేరెంట్స్ లేని సమయంలో బాయ్ ఫ్రెండ్ ను ఇంటికి పిలిచి ఎంజాయ్ చేయాలని భావించింది. కానీ తాను అసలు అనుకోలేదు సడన్ గా తల్లిదండ్రులు వస్తారని… దీంతో ఏం చేయాలో అర్థం కాక ఆ అమ్మాయి తన లవర్ ను బాల్కనీ నుంచి దూకి పారిపోమని సజెస్ట్ చేసింది. అందుకు తగిన ఏర్పాట్లు కూడా చేసి పారిపోమంది. దీంతో సదరు ప్రియుడు ప్రియురాలు ఏర్పాటు చేసిన వస్త్రం సాయంతో గాల్లో దానిని పట్టుకుని వేలాడుతూ కిందకి దిగడానికి ప్రయత్నించాడు. ఆ సయమంలోనే అతడిని పట్టుకుని ఆమె తల్లి చీపురు కట్ట తిరగేసి చితక్కొట్టింది.
ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో యమ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. వీడియో సోషల్ మీడియా ప్రత్యక్షం అయిన దగ్గరనుంచి కోట్లాది వ్యూస్ వచ్చాయి. చాలామంది లైక్ చేస్తున్నారు. కొంతమంది సపోర్ట్ చేస్తుండగా కొందరు విమర్శిస్తున్నారు. మరికొందరైతే పాపం ప్రియుడు ఏమాత్రం పట్టు తప్పిన అతడు కింద పడేలోపే ప్రాణాలు గాల్లో పోవడం ఖాయమంటున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.