రూ.4 కోట్లకు పైగా విలువైన లాటరీని ఆ మహిళ గెలుచుకుంది. ఆ మహిళ పేరు డెబ్స్ ఆర్చర్డ్.. డెబ్స్ తన కుటుంబంతో సెలవులకు వెళ్ళింది. నార్వేజియన్ ఫ్జోర్డ్స్లో విహారయాత్రలో సరదాగా గడుపుతున్న ఆమె డ్యాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఆ తర్వాత నడవడం లేదు.
OMG: ఎవరికైనా ఏదైనా ప్రమాదం జరిగిన వెంటనే వారిని దురదృష్టం వెంటాడుతుందని సాధారణంగా అంటుంటారు. ఇంట్లో నుంచి బయటకు రాకపోయి ఉంటే తమకు ఇలా జరిగి ఉండేది కాదని ప్రజలు ఆ సమయంలో తిట్టడం మొదలుపెడతారు. చాలా సార్లు ప్రజలు భయంకరమైన ప్రమాదాలకు గురవుతారు. కానీ ఒక మహిళ ప్రమాదానికి గురవ్వడం ‘అదృష్టం’ అని నిరూపించబడింది. ప్రమాదంలో ఆమె కాలు విరిగింది.. దీంతో అదృష్టపు తాళం ఓపెన్ అయింది. ఒక్క దెబ్బతో కోట్లకు పడగలెత్తింది.
రూ.4 కోట్లకు పైగా విలువైన లాటరీని ఆ మహిళ గెలుచుకుంది. ఆ మహిళ పేరు డెబ్స్ ఆర్చర్డ్.. డెబ్స్ తన కుటుంబంతో సెలవులకు వెళ్ళింది. నార్వేజియన్ ఫ్జోర్డ్స్లో విహారయాత్రలో సరదాగా గడుపుతున్న ఆమె డ్యాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఆ తర్వాత నడవడం లేదు. ఆపై ఆమెను వైద్యుడి వద్దకు తీసుకెళ్లగా, పరీక్షలో కాలు విరిగిందని తేలింది. ఆమె పర్యటన ముగించుకుని వీల్ చైర్ మీద కూర్చొని తన ఇంటికి తిరిగి వస్తోంది. ఇంతలో మార్గమధ్యంలో ఆమెకు ఓ కాల్ వచ్చింది. మొదట తాను నమ్మలేకపోయింది. ఆస్పత్రినుంచి బయలు దేరింది కాబట్టి మళ్లీ డాక్టర్ ఏమైనా జాగ్రత్తలు చెప్పేందుకు కాల్ చేసి ఉంటాడని భావించింది. ఆ కాల్ పీపుల్స్ పోస్ట్‌కోడ్ లాటరీ నుంచి వచ్చింది. రూ. 4 లక్షల పౌండ్ల లాటరీ అంటే దాదాపు 4 కోట్ల 20 లక్షల రూపాయల లాటరీ తగిలిందని కాల్ చేసిన వ్యక్తి చెప్పాడు. లాటరీలో తనకు ఇంత భారీ మొత్తం వచ్చిందంటే నమ్మలేకపోతున్నానని డెబ్స్ పేర్కొంది
తాను గత 10 సంవత్సరాలుగా లాటరీ టిక్కెట్లు కొంటున్నానని డెబ్స్ చెప్పింది. అయితే తనకు ఇంత పెద్ద ‘జాక్‌పాట్’ వస్తుందని ఊహించలేదు. 2015 సంవత్సరంలో తాను ఒక్క టికెట్‌పై 1000 పౌండ్లు గెలుచుకున్నానని, అంటే ఈ రోజు దాని విలువ సుమారు లక్ష రూపాయలు. అయితే ఈసారి నేరుగా కోటీశ్వరురాలిని అయ్యానని డెబ్స్ చెప్పింది. లాటరీలో గెలిచిన ఈ మొత్తాన్ని ఆమె తన కుటుంబాన్ని చూసుకోవడానికి ఉపయోగిస్తానని చెప్పింది.