»Florida Man 150 Bugs In Larva Stage Inside Nose Face And Lip Swelling Viral Trending News
Florida : ముక్కులో కీటకాల గుంపు.. రోగి పరిస్థితి చూసి షాకైన వైద్యులు
ముక్కులో రక్తస్రావంతో బాధపడుతున్న ఓ వ్యక్తి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి చేరుకోగా.. అతడి పరిస్థితి చూసి వైద్యులు సైతం ఆశ్చర్యపోయారు. ముక్కులో ఈ అసాధారణ దృగ్విషయం ఘటన అమెరికాలో వెలుగు చూసింది.
Florida : ముక్కులో రక్తస్రావంతో బాధపడుతున్న ఓ వ్యక్తి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి చేరుకోగా.. అతడి పరిస్థితి చూసి వైద్యులు సైతం ఆశ్చర్యపోయారు. ముక్కులో ఈ అసాధారణ దృగ్విషయం ఘటన అమెరికాలో వెలుగు చూసింది. ఫ్లోరిడాకు చెందిన ఒక వ్యక్తి గత అక్టోబర్లో ముక్కు నుండి రక్తం నిరంతరం కారడంతో బాధపడుతున్నాడు. అంతకుముందు కొన్నిసార్లు రక్తస్రావం అప్పుడప్పుడు మాత్రమే అయ్యేది. ఆ తర్వాత క్రమంగా సమస్య తీవ్రత పెరిగింది. ఫిబ్రవరి 7న అతని సమస్య ఊహించని మలుపు తిరిగింది. అతని ముక్కు నుంచి నిరంతరం రక్తం కారుతోంది. దాంతో పాటు అతని ముక్కు, పెదవులు వాచిపోయాయి.
వ్యక్తి పరిస్థితిని చూసిన వైద్యులు వెంటనే పలు పరీక్షలు నిర్వహించారు. రక్తస్రావం కావడానికి కారణం తెలియగానే వారు కూడా ఆశ్చర్యపోయారు. డాక్టర్లు అతని ముక్కులో సైనస్ తో పాటు దాదాపు 150 కీటకాలు తమ నివాసాన్ని ఏర్పరచుకున్నాయి. ఈ కీటకాలు అక్కడ మాంసాన్ని తింటుండడం డాక్టర్లు గమనించారు. దాని కారణంగా ముక్కు కుళ్ళిపోవడం, ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందడం ప్రారంభించాయి. అందులోని కొన్ని కీటకాలు మనుషుల గోళ్లంత పెద్దవి.
ఈ సమస్యను పరిష్కరించేందుకు వైద్యులు వెంటనే రంగంలోకి దిగారు. ముక్కులో నుంచి క్రిములను ఒక్కొక్కటిగా తొలగించారు. ఆ వ్యక్తి ముక్కులోని మృతకణాలన్నింటినీ తొలగించి, యాంటీ పరాసిటిక్ మందులను ప్రయోగించారు. ఇదే పరిస్థితి ఎక్కువ కాలం ఉండి ఉంటే ప్రాణాపాయం జరిగేదని వైద్యులు తెలిపారు. రోగి సమస్య గురించి వైద్యులు చాలా ముఖ్యమైన విషయాలను చెప్పారు. రోగికి 30 సంవత్సరాల క్రితం ముక్కు క్యాన్సర్ వచ్చింది. ఆ సమయంలో వైద్యులు నాసికా కుహరంలో కొంత భాగాన్ని తొలగించారు . అక్కడ ఖాళీ ఉంది. దీని కారణంగా సంక్రమణకు అనుకూలమైన పరిస్థితులు సృష్టించబడ్డాయి.
అక్టోబర్ నెలలో రోగి చేపలు పట్టేటప్పుడు నదిలో చేతులు కడుక్కోవడంతో అతని అజాగ్రత్త కారణంగా తన చేతుల నుండి క్రిములు ముక్కులోకి ప్రవేశించాయి. అప్పటికే ఇన్ ఫెక్షన్ కు అనుకూలమైన వాతావరణం ఉండడంతో పురుగులు పెరిగి రక్తస్రావానికి కారణమవుతాయి. ప్రస్తుతం రోగికి యాంటీ పరాసిటిక్ చికిత్స అందిస్తున్నామని, ఆ వ్యక్తి నెమ్మదిగా కోలుకుంటున్నాడని వైద్యులు తెలిపారు.