పంజాబ్ రాష్ట్రం(Punjab State)లో సైన్యంలో పనిచేస్తున్న యువకుడికి వినూత్నంగా ఫ్యామిలీ సభ్యులు రెడ్ కార్పెట్ స్వాగతం పలికారు. గ్రామంలో వ్యవసాయ క్షేత్రాలకు సమీపంలో ఉన్న తమ ఇంటి వద్ద కారులో దిగిన ఆ యువ జవాను… రెడ్ కార్పెట్ (Red carpet) పై కవాతు చేస్తూ ఇంటి గేటు వద్దకు రాగా, అక్కడ కుటుంబ సభ్యులు (Family members) ప్రేమాభిమానాలు, ఆప్యాయతానురాగాలు కలగలిపి, పూలు చల్లుతూ భావోద్వేగభరిత స్వాగతం పలికారు.సైన్యం (Army) లో చేరిన తమ ఇంటివాడ్ని వారు ఆత్మీయంగానూ, గర్వంగానూ హత్తుకుని తమ హృదయ స్పందనను అతడికి వినిపించారు. వెల్కమ్ బ్యాక్ టు హోమ్ అంటూ అందంగా ముగ్గులు వేశారు. ఆ ఇంటి గేటు వద్ద కుటుంబ సభ్యులు, బంధువుల కోలాహలం అంతా ఇంతా కాదు. సైన్యంలో పనిచేయడం ఎంతటి గర్వకారణమో ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది .దేశమాత కోసం వీరపుత్రులను కన్న గడ్డగా పంజాబ్ కు పేరుంది. సైన్యంలోనూ పంజాబీలకు ప్రత్యేకంగా ఓ రెజిమెంట్ ఉంది. తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ (Video viral) అవుతోంది.
The immense pride among family and relatives as this young soldier arrives at his village after being appointed in the Bhartiya Sena. Jai Hind 🇮🇳 pic.twitter.com/vkS1yvS5Uq