Study hard : మనకు ఇన్సిపిరేషన్ అవసరమైనప్పుడల్లా గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రలను చదవుతాము. కానీ ప్రతిసారీ అలాంటి వ్యక్తుల నుండి ప్రేరణ పొందాల్సిన అవసరం లేదు. చాలా సార్లు మన చుట్టూ అలాంటి వ్యక్తులు కనిపిస్తుంటారు. వారు కూడా మనలో బాగా కాన్ఫిడెన్స్ పెంచుతారు. జొమాటో రైడర్ బైక్ నడుపుతూ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓటమిని అంగీకరించేవాడే ఓడిపోతాడని, ఓటమి ముందు మోకరిల్లకుండా పోరాడే వాడు గెలుస్తాడు. జీవితంలో పోరాటం ముఖ్యం. మీ పోరాటమే మిమ్మల్ని విజయం వైపు నడిపిస్తుంది. జొమాటో రైడర్ తన పని కోసం సిద్ధమవుతున్న ఈ క్లిప్‌ని చూడండి.
వైరల్ అవుతున్న వీడియోలో, ఒక Zomato రైడర్ పని చేస్తున్నప్పుడు తన తరగతికి క్రమం తప్పకుండా హాజరవుతున్నట్లు మీరు చూడవచ్చు. అతని చుట్టూ గందరగోళం ఉన్నప్పటికీ, అతను ఏకాగ్రత విధానం నిజంగా ప్రశంసనీయం. ఈ క్లిప్ చూస్తుంటే యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నట్లు అర్థమవుతోంది. ఈ వీడియో @ayusshsanghi అనే ఖాతా ద్వారా Xలో షేర్ చేయబడింది. ఈ వార్త రాసే వరకు 66 వేల మందికి పైగా ప్రజలు దీనిని చూశారు. వీడియోపై నెటిజన్లు పలు రకాల కామెంట్స్ చేస్తున్నారు.