»Us Man Dated 100 Women From All 50 States But Still Have Not Found Mrs Right
Viral: 50 రాష్ట్రాల అమ్మాయిలతో డేటింగ్.. నిజమైన ప్రేమకోసం సెర్చింగ్
ఓ యువకుడి కథ విన్నాక కచ్చితంగా ఆశ్చర్యపోకతప్పదు. అమెరికాలోని మోంటానా నివాసి మాథ్యూ వారింగ్‌కు సరైన జీవిత భాగస్వామి దొరకడం లేదు. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. అతను అమెరికాలోని 50 రాష్ట్రాల నుండి 100 మందికి పైగా అమ్మాయిలతో డేటింగ్ చేశాడు.
Viral: నిజమైన ప్రేమ కోసం ప్రజలు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటారు. నిజమైన ప్రేమను కనుక్కోవడానికి కొన్ని సార్లు రోజుల నుంచి సంవత్సరాలు పట్టొచ్చు. అప్పటికీ ప్రజలు కోరుకున్న జీవిత భాగస్వామిని కనుగొనలేరు. కొంతమంది ఇద్దరు నలుగురు అమ్మాయిలు లేదా అబ్బాయిలతో డేటింగ్ చేసిన తర్వాతే పెళ్లి చేసుకుంటారని చాలాసార్లు వినే ఉంటాం. ఓ యువకుడి కథ విన్నాక కచ్చితంగా ఆశ్చర్యపోకతప్పదు. అమెరికాలోని మోంటానా నివాసి మాథ్యూ వారింగ్‌కు సరైన జీవిత భాగస్వామి దొరకడం లేదు. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. అతను అమెరికాలోని 50 రాష్ట్రాల నుండి 100 మందికి పైగా అమ్మాయిలతో డేటింగ్ చేశాడు. ఆ తర్వాత కూడా తన నిజమైన ప్రేమను కనుగొనలేకపోయాడు.
ఇప్పటి వరకు తాను అమెరికాలోని 50 రాష్ట్రాలకు చెందిన 100 మంది అమ్మాయిలతో డేటింగ్ చేశానని, అయితే ఇప్పటి వరకు బ్యాచిలర్‌గానే ఉన్నానని మాథ్యూ చెప్పాడు. లాక్డౌన్ సమయంలో తాను ఆన్లైన్ డేటింగ్ ప్రారంభించానని, ఇంట్లో కూర్చోవడం విసుగు చెందడమే దీనికి కారణమని తెలిపాడు. అందుకే తన మొబైల్లో డేటింగ్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నానని మాథ్యూ చెప్పాడు.
పరిపూర్ణ జీవిత భాగస్వామిని కనుగొనడానికి తాను అలాస్కా , హవాయి మినహా ప్రతిచోటా నడిపానని మాథ్యూ చెప్పాడు. ఈ రెండు రాష్ట్రాలకు మాత్రమే తాను విమానాల్లో ప్రయాణించాల్సి ఉందని ఆయన చెప్పారు. దీనితో పాటు అతను 50 మంది అమ్మాయిలతో డేటింగ్ గురించి చాలా కథలను కూడా పంచుకున్నాడు. కొంతమంది అమ్మాయిలు తనతో చాలాసార్లు మాట్లాడేవారని, తాను ఉద్యోగం కోసం ఇంటర్వ్యూ ఇవ్వడానికి వచ్చినట్లుగా అనిపించిందని చెప్పాడు. తన డేట్‌ను ఉత్తేజపరిచేందుకు, మాథ్యూ అమ్మాయిలతో హెలికాప్టర్ రైడ్, గుర్రపు స్వారీ, ఎయిర్ బోటింగ్ కూడా చేశాడు.