Palamuru Policeలను గుడ్డలూడదీసి కొడతాం..?: రేవంత్ రెడ్డి
పాలమూరు పోలీసులు అతి చేస్తున్నారని.. తమ పార్టీ అధికారంలోకి వస్తే వడ్డీతో సహా చెల్లిస్తామని అంటున్నారు టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గుడ్డ లూడదీసి మరీ కొడతాం అని చెబుతున్నారు.
Revanth Reddy: తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికల సమయం దగ్గర పడుతోంది. బీఆర్ఎస్- కాంగ్రెస్ పార్టీలు మాటల యుద్దం తీవ్రస్థాయికి చేరింది. అధికార పార్టీకి పోలీసులు వంత పాడుతున్నారని టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్నారు. ముఖ్యంగా పాలమూరు పోలీసులు గురించి ప్రస్తావించారు. ఇక్కడ ఉన్న కొందరు ఎక్కువ చేస్తున్నారని పేర్కొన్నారు. ఓ సభ వేదికపై రేవంత్ రెడ్డి (Revanth Reddy) మాట్లాడారు.
ఎక్కువ చేసిన పోలీసుల పేర్లు డైరీలో రాసి పెడుతున్నామని చెప్పారు. మరో 100 రోజుల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడుతుందని వివరించారు. తమ పార్టీ అధికారంలోకి రాగానే అంతే సంగతులు అని చెప్పారు. మీ గుడ్డలు ఊడతీసి, వడ్డీతో సహా కొడతామన్నారు. మీ వద్ద నుంచి ఏమీ ఉంచుకోమని చెప్పారు. కాంగ్రెస్ నేతలు పక్కన ఉండగా.. రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఉత్సాహాంగా మాట్లాడారు.
ఏ పార్టీ అధికారంలోకి ఉంటే వారికి పోలీసులు సపోర్ట్ చేస్తుంటారు. అలా తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేసి ఉంటారు. అదే విషయాన్ని కాంగ్రెస్ నేతలు, రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రస్తావించారు. ఎవరూ చేసిన తప్పులకు మూల్యం చెల్లించుకోవాల్సిందేనని తేల్చిచెప్పారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరినీ వదలబోమని తేల్చిచెప్పారు.
మహబూబ్ నగర్ పోలీసులను గుడ్డలు ఊడతీసి కొడతా అంటూ వార్నింగ్ ఇచ్చిన రేవంత్ రెడ్డి
డైరీలో పోలీసుల పేర్లు రాసి పెడుతున్నాం. 100 రోజుల తరువాత అధికారంలోకి రాగానే మీ గుడ్డలు ఊడతీసి, అసలు మిత్తితో సహా చెల్లిస్తాం – టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి pic.twitter.com/CAghpkGmyR
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలపడినట్టే అనిపిస్తోంది. ఎన్నికల సమయం నాటికి కూడా ఇదే ఊపు, ఉత్సాహం చూపితే.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టడం ఖాయం అనే రాజకీయ విశ్లేషకులు కొందరు ఉన్నారు. కానీ ఆ పార్టీలో నేతల మధ్య సమన్వయ లోపం శాపంగా మారుతోంది. టీడీపీ నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి (Revanth Reddy) అతి చేస్తున్నారని కొందరు సీనియర్లు పెదవి విరుస్తున్నారు.