»Rs 76 Lakhs Range Rover For Rs 100 Bumperoffer Only For A Few More Days
Raas Festival: రూ.100లకే రూ.76 లక్షల రేంజ్ రోవర్..మరికొద్ది రోజుల వరకే బంపరాఫర్
ప్రతి ఏడాది లాగే ఈసారి కూడా రాస్ వేడుకలు ఘనంగా జరగనున్నాయి. రాస్ ఫెస్టివల్ సందర్భంగా ఎప్పటిలాగే రూ.100లకు లాటరీ టిక్కెట్లను విక్రయించనున్నారు. అందులో మొదటి బహుమతిగా రూ.76 లక్షలు విలువ చేసే రేంజ్ రోవర్ కారును ఇవ్వనున్నారు. అలాగే మిగిలిన బహుమతులు కూడా ఖరీదైన కార్లనే ఇవ్వనున్నట్లు తెలిపారు. దీంతో లాటరీ టిక్కెట్ల కోసం జనాలు ఎగబడుతున్నారు.
అసోంలోని హౌలీలో ప్రతి ఏటా రాస్ ఫెస్టివల్ (Raas Festival) ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఫెస్టివల్‌కి దేశవ్యాప్తంగా ఎంతో క్రేజ్ ఉంది. ఈ వేడుకల సందర్భంగా లాటరీ (Lottery) టిక్కెట్లు నిర్వహించి ఖరీదైన బహుమతులను అందజేస్తారు. తక్కువ ధర టికెట్లతో విలువైన కార్లను గెలుచుకునే అవకాశం కూడా ఉంటుంది. ఈ ఏడాది జరిగే ఈ వేడుకల్లో కూడా ఖరీదైన వస్తువులను అందజేస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఇందులో భాగంగా మొదటి బహుమతిగా రూ.76 లక్షలు విలువ చేసే రేంజ్ రోవర్ కారును ఇవ్వనున్నారు. అంటే కేవలం రూ.100లు చెల్లించి ఈ కారును గెలుచుకునే అవకాశం ఉంటుంది.
ఈ రాస్ వేడుకలను ప్రతి ఏటా ఘనం నిర్వహించడం ఆనవాయతీగా వస్తోంది. ఈ సంప్రదాయంలో భాగంగా పండగకు ముందుగా లాటరీ ఈవెంట్‌ను నిర్వహిస్తారు. అందులో లాటరీ విజేతలకు ఖరీదైన కార్లను ఇస్తారు. ఈసారి మొదటి బహుమతి కింద రూ.76 లక్షల రేంజ్ రోవర్ కారు, ఆ తర్వాతి బహుమతులుగా రూ.50 లక్షల విలువైన టయోటా ఫార్చ్యూనర్ కారు, స్కార్పియో, స్కోడా కుచక్, నెక్సాన్ కార్లను ఇవ్వనున్నారు.
లాటరీ టిక్కెట్ ధరను రూ.100 కావడంతో ప్రకటన రాగానే లాటరీ టిక్కెట్లు కొనేందుకు జనాలు ఎగబడుతున్నారు. హౌలీలోని గిఫ్ట్ కూపర్ కార్యాలయాల వద్దకు జనాలు బారులు తీరుతూ టిక్కెట్లను కొనుగోలు చేస్తున్నారు. లాటరీ విజేతలను డిసెంబరు 10వ తేదిన వెల్లడించనున్నట్లు తెలిపారు. గత ఏడాది మొదటి బహుమతిగా ఆడి కారును గువహాటికి చెందిన జనార్దన్ బోరో అనే పోలీసు అధికారి గెలుపొందారు. ఆ ఏడాదిలో 3.2 లక్షల లాటరీ టిక్కెట్లను విక్రయించారు. అయితే ఈ ఏడాది మాత్రం 4 లక్షల టిక్కెట్లను విక్రయించాలని టార్గెట్‌గా పెట్టుకున్నారు. నవంబర్ 24వ తేది నుంచి డిసెంబర్ 10వ తేది వరకూ రాస్ వేడుకలను నిర్వహించనున్నారు.