Dil Raj కామెంట్స్‌తో బన్నీ, ప్రభాస్ ఫ్యాన్స్ హర్ట్!
Dil Raj : ప్రస్తుతం దిల్ రాజు అంటే ఓ బ్రాండ్. దాదాపుగా టాలీవుడ్లో ఉన్న స్టార్ హీరోలందరితోను సినిమాలు చేశారు. సుకుమార్, బోయపాటి శ్రీను లాంటి ఎందరో స్టార్ డైరెక్టర్స్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఫ్యూచర్లో ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్.. ఇలా టాలీవుడ్లో ఉన్న స్టార్ హీరోలందరితోను సినిమాలు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
ప్రస్తుతం దిల్ రాజు అంటే ఓ బ్రాండ్. దాదాపుగా టాలీవుడ్లో ఉన్న స్టార్ హీరోలందరితోను సినిమాలు చేశారు. సుకుమార్, బోయపాటి శ్రీను లాంటి ఎందరో స్టార్ డైరెక్టర్స్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఫ్యూచర్లో ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్.. ఇలా టాలీవుడ్లో ఉన్న స్టార్ హీరోలందరితోను సినిమాలు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. రీసెంట్గా నిర్మాతగా 20 ఏళ్లు కంప్లీట్ చేసుకున్నారు దిల్ రాజు. ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్నారు. స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా.. దిల్ రాజు బ్యానర్లో వస్తున్న 50వ సినిమా. అందుకే ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఇదిలా ఉంటే.. దిల్ రాజు ఏం మాట్లాడినా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ట్రోలింగ్ కూడా అదే రేంజ్లో ఉంటుంది. వారసుడు సినిమా తమిళ్ ఈవెంట్లో దిల్ రాజు స్పీచ్ ఇప్పటికీ వైరలే. అదే సమయంలో అజిత్ కంటే విజయ్ పెద్ద హీరో అని చెప్పడంతో తమిళ తంబీలు ఫైర్ అయ్యారు. అయితే ఇప్పుడు అల్లు అర్జున్, ప్రభాస్ ఫ్యాన్స్.. దిల్ రాజు చేసిన కామెంట్స్‌కు హర్ట్ అయినట్టే ఉన్నారు. అందుకే దిల్ రాజును ట్రోల్ చేస్తున్నారు. తన 20 ఏళ్ల సినీ ప్రయాణం గురించి దిల్ రాజు ఇచ్చిన ఓ ఇంటర్య్వూలో.. తను అప్పటి వరకు చేసిన పెద్ద హీరోల్లో.. ఫస్ట్ టైం స్టార్‌తో చేసిన సినిమా ఎన్టీఆర్ బృందావనం అని అన్నారు. ఇదే ఇప్పుడు బన్నీ, ప్రభాస్ ఫ్యాన్స్‌ను హర్ట్ అయ్యేలా చేసింది. బృందావనం కంటే ముందు ప్రభాస్‌తో మున్నా, అల్లు అర్జున్‌తో పరుగు సినిమాలు చేశారు దిల్ రాజు. కానీ తను ఫస్ట్ టైం చేసిన పెద్ద స్టార్ ఎన్టీఆర్ అని చెప్పడంతో.. ప్రభాస్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ దిల్ రాజును ట్రోల్ చేస్తున్నారు. అయితే అప్పటి లెక్కల ప్రకారం.. ప్రభాస్, బన్నీ కంటే ఎన్టీఆర్‌నే బిగ్ స్టార్. అందుకే దిల్ రాజు ఈ కామెంట్స్ చేసి ఉంటారని అంటున్నారు నెటిజన్స్.