చైనాకు చెందిన ఓ నటుడు కేవలం బెగ్గింగ్ ద్వారా నెలకు రూ. 8 లక్షల వరకు అర్జిస్తున్నాడు. వృత్తిరిత్యా నటుడు అయిన ఇతను తన యాక్టింగ్ స్కిల్స్‌తో ప్రజల సింపథి కొట్టేస్తున్నాడు. తద్వారా ఏడాదికి దాదాపు కోటి రూపాలు సంపాదిస్తున్నాడు.
Begging Rs. Chinese actor Lu Jingang who earns 8 lakhs.. viral
Viral News: అడుక్కునే సంపన్నుడు భరత్ జైన్ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. భారతదేశంలోని ముంబయిలో ఆయనకు సొంత భవనం, నెలకు రూ. 70 వేల వరకు సంపాదిస్తాడు అని తెలిసి చాలా మంది ఆశ్చర్యపోయారు. ఇతనికి మించిన మరో సంపన్న బెగ్గర్ తాజాగా వెలుగులోకి వచ్చాడు. అతని నెల సంపాదన రూ. 8 లక్షలు ఉంటుందట. ఏడాదికి దాదాపు రూ. 1 కోటి సంపాదిస్తున్న బెగ్గర్ పేరు లూ జింగాంగ్. ఇతనొక చైనీస్ ప్రొఫెషనల్ నటుడు. అందులో అవకాశాలు రాలేదు. అక్కడితో తన యాక్టింగ్ స్కిల్స్ వృథా కాకుండా అడుక్కోవడంపై పెట్టాడు.
ఎప్పుడూ రద్దీగా ఉండే ప్రదేశంలో యాచిస్తూ నెలకు రూ.8 లక్షల వరకు సంపాదిస్తున్నాడు. లూ జింగాంగ్ను బిచ్చగాడి వేషంలో చూస్తే ఎవరికైనా జాలి కలుగుతుందట. వెంటనే జేబులో ఉన్న డబ్బులు తీసి ఇచ్చేస్తారట. దీనికి కారణం అతని అద్భుతమైన నటనా నైపుణ్యాలే. అంటే నేర్చుకున్నది వృథా కాలేదు అన్నమాట. ఇంటి నుంచి వచ్చేటప్పుడు మంచి బట్టల్లో వచ్చి తరువాత చిరిగిపోయిన దుస్తులు, ముఖానికి నల్లటి మసిని రాసుకుంటాడు. అనంతరం తన ట్యాలెంట్‌ను ప్రదర్శిస్తాడు. దీంతో నెలకు 70,000 యువాన్ల (సుమారు రూ. 8 లక్షలు) వరకు సంపాదిస్తున్నాడు. చైనాలో అత్యధిక జీతం దాదాపు 29,000 యువాన్లు (సుమారు రూ. 3 లక్షలు). కానీ, లూ నెలవారీ సంపాదన రూ.8 లక్షలు. ప్రస్తుతం లూ జింగాంగ్ న్యూస్ వైరల్ అవుతుంది.