»A Teacher Giving A Life Lesson To Children What Is A Good Touch What Is A Bad Touch
Teacher’sDay: పిల్లలకు జీవిత పాఠం.. ఏది గుడ్ టచ్.? ఏది బ్యాడ్ టచ్.?
చిన్నప్పటి నుంచే ఏది మంచి ఏది చెడు అనే విషయాన్ని స్పష్టంగా చెబుతుంటే పిల్లలు ఎదిగే క్రమంలో అన్ని తెలుస్తాయి. అందుకే ఒక పాఠశాలలో టీచర్ ఏది గుడ్ టచ్, ఏది బ్యాడ్ టచ్ అనే దానిపై పిల్లలకు చూపిస్తూ నేటిజనులచేత ప్రశంసలను అందుకుంటుంది.
A teacher giving a life lesson to children.. What is a good touch? What is a bad touch?
Teacher’sDay: సమాజంలో క్రూరమృగాలు విశృంకలంగా పెరుగుతున్న నేపథ్యంలో మనకు మనకే రక్షణకవచంగా మారాలి. అవతిలి వాడి మాటల్లేనే మంచి చెడులను ఎక్కగట్టాలి. అలా అయితే ఇక్కడ బతకగలం అందుకు తగ్గట్లుగానే పిల్లలను కూడా తల్లిదండ్రులు పెంచాలి. అయితే దీనికి సంబంధించి ఒక ఉపాధ్యాయురాలు పిల్లలకు ఏది మంచి టచ్, ఏది చెడు టచ్ అన్న విషయాన్ని చక్కగా వివరిస్తుంది. పాఠశాలలో కేవలం పుస్తకాల్లోని పాఠాలను మాత్రమే కాదు జీవిత పాఠాలు కూడా చెబుతుందంటూ అందరు ఆమెను మెచ్చుకుంటున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్ల వైరల్ అవుతుంది.
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ప్రతి విద్యార్థి తమ గురువులను పూజిస్తారు. ఈ మేరకు ఒక పాఠశాలలో టీచర్ చేసిన పనికి ప్రతి ఒక్కరు చేతులెత్తి మొక్కుతున్నారు. నేటి పరిస్థితుల్లో చిన్న పిల్లలపై లైంగిక నేరాలు పెరుగుతున్నాయి. వాటి నుంచి పిల్లలను కాపాడుకోవాలంటే ఒకటే మార్గం. పిల్లలకు అవగాహన కల్పించాలి. పిల్లలకు శరీర అవయవాల గురించి వారికి తెలియజేయడం చాలా అవసరం. శరీరానికి సంబంధించి సొంతంగా కొన్ని నియమాలు ఉంటాయని పిల్లలకు తెలియాలి. వాటిని ఇతరులు అతిక్రమిస్తున్నప్పుడు స్పందించడమే కాదు, తక్షణం వ్యతిరేకించడమూ నేర్పించాలి.
ఇందుకు సంబంధించిన వీడియోను ఓ నెటిజన్ సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. అందులో ఆ స్కూల్ టీచర్ (Teacher).. ఏది మంచి టచ్, ఏది కాదో? (good touch vs bad touch) విద్యార్థులు స్వయంగా తెలుసుకునేలా నేర్పించారు. ఎదుటి వ్యక్తులు ఛాతిపై తడమటం, గట్టిగా కౌగిలించుకోవడం, శారీరకంగా హాని కలిగించేలా అసభ్యంగా తాకడం వంటివి చేసినప్పుడు పిల్లలు ఎలా ప్రతిఘటించాలో ఆమె పిల్లలతో చేసి చూపించారు. ఆప్యాయంగా తాకడం, దురుద్దేశపూరితంగా ముట్టుకోవడం మధ్య తేడాను వారికి అర్థమయ్యేలా వివరిస్తున్నారు. అది ఎప్పుడు ఎక్కడ జరిగిందో తెలియదు కాని ఒక ఎక్స్ సోషల్ మీడియా అకౌంట్ నుంచి పోస్ట్ చేశారు. ఆ టీచరమ్మకు దేశవ్యాప్తంగా ప్రశంసలు కురిపిస్తున్నారు.
This teacher deserves to get famous 👏
This should be replicated in all schools across India.