»Husband Shaves Half Of Head Hair Of His Wife For Illegal Relationship In Sri Sathya Sai District
Viral News: భార్యను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భర్త.. అరగుండు కొట్టించి ఊరేగించాడు
వివాహేతర సంబంధాలు కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తాయి అన్న విషయం తెలిసిందే. ఇలాంటి ఒక రిలేషన్‌ను భర్త రెండ్ హ్యండెడ్‌గా పట్టుకున్నారు. ఊరందరి సమక్షంలో వారికి తగిన గుణపాఠం చెప్పారు.
husband shaves half of head hair of his wife for illegal relationship in sri sathya sai district
Viral News: తప్పుడు మార్గంలో వెళుతున్న భార్య(wife)కు చాలా సార్లు చెప్పాడు. ఓపిక పట్టాడు. అయినా తన భార్య వినలేదు. భర్తే కదా అని చులకన భావంతో తన పని తాను చేసుకుంటూ పోయింది. కళ్లుమూసుకొని పిల్లి పాలు తాగుతుంది అన్న చందంగా గుట్టు చప్పుడు కాకుండా అక్రమసంబంధం పెట్టుకున్నాను అనుకున్న ఆ ఖిలాడీ లేడీని భర్త ఒక కంటకనిపెట్టాడు. తన ప్రియుడితో ఏకాంతంలో ఉన్న సమయంలో ఇద్దరిని పట్టుకున్నాడు. ఇద్దరికి అరగుండు కొట్టించి ఊరేగించాడు. ఈ ఘటనతో స్థానికులు ఒక్క సారిగా షాక్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లోని శ్రీసత్యసాయి(sri sathya sai ) జిల్లాలో చోటుసుకున్న ఈ విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. లేపాక్షి మండలం ఇందిరమ్మ కాలనీలో అక్రమ సంబంధం కొనసాగిస్తుందని భార్యను పట్టుకున్నాడు. దాంతో భార్యకు, ఆమె ప్రియుడికి అత్తమామలు అరగుండు చేసిన ఘటన స్థానికంగా సంచలనం రేపుతోంది. పరిగి మండలం ఊటుకూరు గ్రామానికి చెందిన హుస్సేన్ అనే వ్యక్తితో తిలక్ నగర్‌కు చెందిన మహిళ అక్రమ సంబంధం కొనసాగిస్తుందని భర్త ఆరోపిస్తున్నాడు.
ఈ క్రమంలో భార్య, ప్రియుడు ఒకే చోట ఉన్నారన్న పక్కా సమాచారంతో భర్త, అతని కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్లారు. అనంతరం ఇద్దరినీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆ తర్వాత భర్త, అత్తమామలు కలిసి ఇద్దరికీ అరగుండు గీయించి, మెడలో చెప్పుల దండ వేసి చేతులను తాళ్ళతో కట్టేసి ఊరేగించారు. తప్పుడు మార్గంలో నడవొద్దని పలు మార్లు హెచ్చరించినా వినకపోవడంతో వారికి బుద్ది చెప్పానని భర్త పేర్కొన్నాడు. ఈ ఘటనపై భార్య, ప్రియుడు హుస్సేన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.