»The Central Government Has Banned Two More Loan Apps They Have Been Issued Warnings
Loan Apps: మరో రెండు లోన్ యాప్స్‌ను బ్యాన్ చేసిన కేంద్రం.. వారికి హెచ్చరికలు జారీ
ఆన్లైన్ లోన్ యాప్‌ల వల్ల చాలా మంది వేధింపులు అనుభవించి ఆత్మహత్య చేసుకున్నారు. గతంలో ఈ లోన్ యాప్‌లను 50కి పైగా కేంద్రం బ్యాన్ చేసింది. తాజాగా మరో రెండు యాప్‌లను క్లోజ్ చేస్తూ ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది.
కరోనా వచ్చాక ప్రజలు ఆన్లైన్ ద్వారా రుణాలు తీసుకోవడం ఎక్కువైంది. రుణ మార్కెట్ కూడా వేగంగా అభివృద్ధి చెందుతూ వస్తోంది. అదే టైంలో ఆన్లైన్లో మోసాలు కూడా ఎక్కువవుతున్నాయి. రుణ యాప్‌ల (Loan Apps) వేధింపుల వల్ల చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. అనేక యాప్‌లు ఆర్బీఐ (RBI) అనుమతి లేకుండానే లావాదేవీలు జరుపుతూ మోసాలకు పాల్పడుతున్నాయి. సిబిల్ స్కోర్ (Cibil score), ఇతర పత్రాలు లేకుండానే రుణాలను ఇస్తూ ఆ తర్వాత వారిని బ్లాక్ ఆ యాప్‌లు తీవ్ర ఇబ్బంది పెడుతున్నాయి.
ప్రజలను ఇబ్బంది పెడుతున్న 50కి పైగా లోన్ యాప్ (Loan Apps) లను కేంద్ర ప్రభుత్వం నిషేధిస్తూ ఉత్తర్వులిచ్చింది. అయినప్పటికీ కొత్త కొత్త లోన్ యాప్‌లు పుట్టుకొస్తూనే ఉన్నాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం మరో రెండు కొత్త లోన్ యాప్‌లకు సంబంధించి కీలక విషయాలను వెల్లడించింది. భారత ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సైబర్డోస్ట్ అనే సైట్ ఆ రెండు యాప్ గురించి పలు విషయాలను తెలిపింది.
ప్రభుత్వం హెచ్చరించిన రుణ యాప్‌లలో విండ్మిల్ మనీ (Windmill Money), ర్యాపిడ్ రూపీ ప్రో (Rapid Rupee Pro) వంటి రెండు లోన్ యాప్ లు ఉన్నాయి. ఈ రెండు యాప్‌లు దుర్వినియోగానికి పాల్పడుతున్నాయని ఓ యూజర్ ట్విట్టర్లో స్క్రీన్ షాట్లను షేర్ చేస్తూ ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగుచూసింది. విండ్మిల్ యాప్ ప్రస్తుతం గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉండగా, ర్యాపిడ్ రూపీ ప్రో యాప్‌ను కేంద్రం తొలగించినట్లు తెలిపింది. రుణగ్రహీతలు ఇప్పటికైనా జాగ్రత్తగా ఉండాలని, లోన్ యాప్‌లను ఆశ్రయించవద్దని కేంద్ర ప్రభుత్వం సూచించింది.