Chandana: దీప్తి హత్య కేసు మిస్టరీ వీడింది. సొంత చెల్లి చందన దీప్తిని హత్య చేసిందని పోలీసులు తేల్చారు. చందన, ఆమె బాయ్ ఫ్రెండ్‌ను నిన్న ఒంగోలులో పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అక్కడినుంచి జగిత్యాల తీసుకొచ్చి తమదైన శైలిలో విచారించారు. అక్కను హత్య చేసినట్టు చెల్లి చందన పోలీసుల ముందు అంగీకరించింది. జగిత్యాల ఎస్పీ భాస్కర్ దీప్తి హత్య గురించి ఈ రోజు సాయంత్రం వివరిస్తారు.
దీప్తి.. సాప్ట్ వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తోంది. వర్క్ ఫ్రం హోమ్ ఆప్షన్ ఉండటంతో ఇంటి నుంచే వర్క్ చేస్తోంది. చందన హైదరాబాద్‌లో బీటెక్ చేస్తోంది. ఆమె స్నేహితుడిని ప్రేమిస్తోందని.. మతాంతర వివాహాం చేసుకోవాలని అనుకుందని తెలిసింది. పేరంట్స్, దీప్తి వ్యతిరేకించారు. పేరంట్స్ హైదరాబాద్ వెళ్లగా.. అదను చూసి సోదరిని హత్య చేసి పారిపోయింది.
చందనకు ఆమె బాయ్ ఫ్రెండ్, డ్రైవర్, మరొ బంధువు సహకరించారని తెలిసింది. దీప్తి హత్య తర్వాత ఆమె తండ్రి శ్రీనివాస్ రెడ్డి.. చందనపై అనుమానం వ్యక్తం చేశాడు. దీంతో పోలీసులు ఆమె కోసం గాలించారు. లుక్ ఔట్ నోటీసులు కూడా జారీచేశారు. టంగుటూర్లో టోల్ గేట్ తప్పించుకుని ఆలకూరపాడు వైపు వెళ్లిందని గుర్తించారు. అక్కడ తనిఖీలు చేపట్టారు. ఒంగోలులో లాడ్జీలో పట్టుకుని.. జగిత్యాల పోలీసులకు అప్పగించారు.
దీప్తి హత్య తర్వాత చందన తమ్ముడికి వాయిస్ మేసెజ్ పెట్టింది. అందులో తాను అక్కను చంపలేదని పేర్కొంది. దీంతో మరింత అనుమానం వచ్చింది. తండ్రి ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగారు. విచారిస్తే అసలు నిజం చెప్పింది. ఇంత చిన్న వయస్సులో హత్య చేసేంత ధైర్యం, కఠినత్వం ఎక్కడిది అని స్థానికులు వాపోతున్నారు.