Cobra Hide Shoe: ఆరు బయట ఉన్న దుస్తులు, గొడుగు, కవర్లను జాగ్రత్తగా గమనించాలి. అవును.. లేదంటే ప్రమాదం బారిన పడతారు. ఉక్కపోత ఎక్కువైతే పాములు బయటకు వస్తుంటాయి. అలా ఓ నాగుపాము (Cobra) పిల్ల దాక్కొని ఉంది. షూ వేసుకునే సమయంలో పదే పదే గమనించాలని ఇప్పటికే పలు వీడియోలను షేర్ చేశారు. ఇప్పుడు మరో వీడియో షేర్ అయ్యింది. ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నందా ఆ వీడియో పోస్ట్ చేశారు.
ఇంటి ముందు ఉన్న షూ జాగ్రత్తగా గమనించాలని సుశాంత నందా చెబుతున్నారు. ఓ సారి వీడియో చూడండని యూజర్లను కోరారు. ఓ మహిళ షూలో నాగుపాము పిల్ల దాక్కొని ఉంది. షూ కదిలించగా బయటకు వచ్చి బుసలు కొట్టింది. కోబ్రా (Cobra) కొత్త షూ ట్రై చేస్తోందని రాసుకొచ్చారు. అలా అంటూనే వర్షకాలంలో జాగ్రత్తగా ఉండాలని వార్నింగ్ ఇచ్చారు.
వర్షకాలం.. సీజన్ స్టార్ట్ అయ్యే సమయంలో ఉక్కపోతతో పాములు బయటకు వస్తాయి. సో.. ఆ సమయంలో జాగ్రత్తగా ఉండాలని కోరారు. బయట ఉన్న బట్టలు, గొడుగు కూడా చెక్ చేయాలని సూచించారు. నాగుపాము (Cobra) పిల్ల వీడియోకు యూజర్లు కామెంట్స్ చేశారు. తేళ్లు కూడా ఉండొచ్చని ఒకరు రాశారు. కప్ప ఉన్న షూ వేసుకుని.. పాము అని భయపడి విసిరి వేశానని మరొకరు రాశారు.
Cobra trying a new footwear😳😳 Jokes apart, as the monsoon is coming to a close, please be extra careful. pic.twitter.com/IWmwuMW3gF
సో.. ఏ కాలం అయినా సరే.. బయట ఉన్న వస్తువులు వాడే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా అటవీ ప్రాంతం అనుకొని ఉన్నవారు.. పల్లెటూరిలో ఉన్న వారు.. టౌన్/ సిటీలో అయితే గ్రౌండ్ ప్లోర్లో ఉన్న వారు జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నారు.