IPS Officerకి న్యూడ్ వీడియో కాల్, రికార్డ్.. ఆపై బెదిరింపులు
ఓ ప్రొబెషనరీ ఐపీఎస్ అధికారిని సైబర్ కేటుగాళ్లు వేధించారు. వీడియో కాల్ చేసి, రికార్డ్ చేశారు. తర్వాత డబ్బులు ఇవ్వాలని.. లేదంటే సోషల్ మీడియాలో వీడియో అప్ లోడ్ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. దీంతో అతను సైబర్ పోలీసులకు ఈ విషయం తెలియజేశాడు.
IPS Officer: సైబర్ ఛీటర్స్ ఎవరినీ వదలడం లేదు. చివరికీ ఐపీఎస్ అధికారులను కూడా వేధిస్తున్నారు. అవును.. మీరు చదువుతుంది నిజమే.. హైదరాబాద్లో ఓ ఐపీఎస్ (IPS Officer) ప్రొబెషనరీ అధికారికి ఇలా బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో అతను సైబర్ పోలీసులను ఆశ్రయించారు.
గుర్తు తెలియని నంబర్ నుంచి ఫోన్ వచ్చింది. అది వీడియో కాల్.. అయినప్పటికీ.. ఎవరో అవసరం ఉండి ఫోన్ చేశారని అనుకున్నాడు. జాలి చూపించి కాల్ లిప్ట్ చేశాడు. ఇంకేముంది.. ఓ అమ్మాయి నగ్నంగా ఉంది. సైబర్ ఛీటర్స్ అని గమనించి.. వెంటనే కాల్ కట్ చేశాడు. ఆ కాల్ రికార్డ్ చేశారు.. వెంటనే మరో నంబర్ నుంచి ఛీటర్స్ ఫోన్ చేశారు.
ఆ ఫోన్ ఎత్తగా.. కాల్ చేసిన విషయం తెలిపారు. డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆ వీడియోను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తామని బెదిరించారు. వెంటనే ఆ అధికారి సైబర్ క్రైమ్ పోలీసులకు విషయం చెప్పాడు. ఆ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
సో.. ఇలా ఐపీఎస్ అధికారులను కూడా సైబర్ ఛీటర్స్ వదలడం లేదు. వీడియో కాల్స్ చేస్తూ.. రికార్డ్ చేస్తున్నారు. అతను ఐపీఎస్ కావడంతో.. వెంటనే కాల్ కట్ చేశాడు. తర్వాత బెదిరించిన.. వెంటనే సైబర్ పోలీసుల దృష్టికి విషయం తెలిపాడు. దీంతో వారి పని అవుతోంది.