Amith Shah: త్వరలోనే నేర చట్టాల బిల్లుకు ఆమోదం..ప్రజల హక్కులు రక్షిస్తాం
హైదరాబాద్‌లోని నేషనల్ పోలీస్ అకాడమీలో నిర్వహించిన ఐపీఎస్ ల పాసింగ్ ఔట్ పరేడ్‌కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మొదట వల్లభాయ్ పటేల్ విగ్రహానికి నివాళులు అర్పించి..ఆ తర్వాత వివిధ రకాల చట్టాల గురించి ప్రస్తావించారు.
Amith Shah: హైదరాబాద్‌లోని నేషనల్ పోలీస్ అకాడమీలో 75వ బ్యాచ్ ఐపీఎస్‌ల పాసింగ్ అవుట్ పరేడ్ జరుగుతోంది. దీనికి ముఖ్య అతిథిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరయ్యారు. ఐపీఎస్ ట్రైనీలో 175 మంది శిక్షణ పూర్తిచేసుకున్నారు. ఈ ట్రైనీ అధికారుల నుంచి అమిత్‌షా గౌరవ వందనం స్వీకరించారు. తర్వాత అమిత్‌షా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ‘మహిళలకు 33శాతం రిజర్వేషన్లు లభించాయి. కర్తవ్య నిర్వహణలో అమరవీరుల బలిదానం ప్రేరణ కావాలి. వివిధ రకాల వ్యవస్థీకృత నేరాలు సవాళ్లు విసురుతున్నాయి. నకిలీ నోట్ల కట్టడికి మరింత పటిష్ఠంగా పోరాడాలి. ఆంగ్లేయుల కాలంలో ఉండే మూడు చట్టాలను మార్చాలి. సీఆర్పీసీ, ఐపీసీ, ఎవిడెన్స్ చట్టాల్లో మార్పులు చేయాలి. ఈ మూడు చట్టాలను కేంద్ర ప్రభుత్వం మార్పులు చేసి పార్లమెంట్ ముందు ఉంచింది. త్వరలోనే నేర చట్టాల బిల్లు ఆమోదం పొందుతుంది. శాసనాలను సురక్షితంగా ఉంచడమే పాత చట్టాల ఉద్దేశం. ప్రజల హక్కులను సురక్షితంగా ఉంచడం కొత్త చట్టాల ఉద్దేశం. వీటి ఆధారంగా అధికారులు ప్రజలకు రక్షణ కల్పించాలని’ అమిత్ షా అన్నారు.
ఇందులో 155 ఇండియన్ ట్రైనీ ఐపీఎస్‌లు, 20 మంది ఫారిన్ ఆఫీసర్లు శిక్షణ పూర్తి చేసుకున్నారు. 102 వారాల శిక్షణలో ట్రైనీలు మొదటి దశ పూర్తి చేసుకున్నారు. 75 మంది ఉన్న ఐపీఎస్ బ్యాచ్‌లో 34 మంది మహిళ ట్రైనీ ఐపీఎస్‌లు ఉన్నారు. వారిలో 32 మంది ఇండియన్ ట్రైనీలు కాగా.. ఇద్దరు విదేశీయులున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలకు 14 మంది ట్రైనీ ఐపీఎస్‌లను కేటాయించారు. తెలంగాణకు 9 మంది, ఏపీకి ఐదుగురు ఐపీఎస్‌లను కేటాయించగా..తెలంగాణకు ముగ్గురు మహిళ ఐపీఎస్‌లు, ఏపీకి ఒక మహిళ ఐపీఎస్‌ను ప్రకటించారు.