65Weds 16: ముసలోడి సుడి మామూలుగా లేదు.. 65ఏళ్ల వయసులో 16 ఏళ్ల అమ్మాయితో పెళ్లి
బ్రెజిల్ దేశంలో ఓ వింత పెళ్లి జరిగింది. 16ఏళ్ల అమ్మాయిని 65ఏళ్ల వ్యక్తి చేసుకున్నాడు. అతను సాధారణ పౌరుడు కాదు. దక్షిణ బ్రెజిల్‌లోని అరౌకారియా నగర మేయర్.
65Weds 16: బ్రెజిల్ దేశంలో ఓ వింత పెళ్లి జరిగింది. 16ఏళ్ల అమ్మాయిని 65ఏళ్ల వ్యక్తి చేసుకున్నాడు. అతను సాధారణ పౌరుడు కాదు. దక్షిణ బ్రెజిల్‌లోని అరౌకారియా నగర మేయర్. అతడి పేరు హిస్సామ్ హుస్సేన్ దేహైని. తన కన్నా 49 ఏళ్లు చిన్నదైన ఓ 16 ఏళ్ల అమ్మాయిని వివాహం చేసుకుని చిక్కుల్లో పడ్డారు. ఆమెను పెళ్లి చేసుకున్న తర్వాత తన అత్తగారిని స్థానిక ప్రభుత్వంలో సాంస్కృతిక, పర్యటక శాఖ కార్యదర్శిని చేశారు. ఇదే తనకు సమస్యలను తెచ్చిపెట్టింది. ఈ విషయం బయటపడడంతో మేయర్‌పై అవినీతి, బంధుప్రీతి ఆరోపణలు వచ్చాయి. వాటి ఫలితంగా మేయర్ పై విచారణ మొదలు పెట్టాయి.
నిజానికి ఆ దేశ చట్టాల ప్రకారం 16 ఏళ్ల పైబడిన అమ్మాయిలను వివాహం చేసుకోవాలంటే కచ్చితంగా వారి పేరెంట్స్ పర్మీషన్ ఉండాలి. దీంతో అమ్మాయికి 16 ఏళ్లు దాటిన తెల్లారే మేయర్ పెళ్లి చేసుకున్నారు. అయితే, అమ్మాయి తల్లికి అంతకుముందే విద్యా శాఖలో ఉద్యోగం ఉంది. కానీ తక్కువ జీతం, హోదా కావడం వల్ల.. పెళ్లైన తర్వాత పర్యటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శిగా నియమించారు. ఈ నియామకం కారణంగా మేయర్ పై పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. సిటీ సివిల్ రిజిస్ట్రీ హిల్దా లక్లాసీ సీమా ఈ విషయాన్ని బయటపెట్టారు. ఈమె ప్రస్తుతం నగరానికి డిప్యూటీ మేయర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. దేహైనితో కలిసే సీమా.. 2016, 2020 ఎన్నికల్లో పోటీ చేశారు. ఈ వివాదంపై స్పందించిన మేయర్ కార్యాలయం ఓ ప్రకటనను విడుదల చేసింది. మేయర్.. తనకున్న విచక్షణ అధికారాల మేరకు.. నిబంధనలకు లోబడే ఆమెను కార్యదర్శిగా నియమించారని తెలిపింది. ఆమెకు ప్రజాసేవలో 26 ఏళ్ల అనుభవం ఉందని ఆ ప్రకటనలో పేర్కొంది. కానీ మేయర్ కార్యాలయం చేసిన ప్రకటనను సీమా తోసిపుచ్చారు.