»13 Year Old Boy Becoming A Father In Usa Colorado
Minor 31 ఏళ్ల మహిళను తల్లిని చేసిన 13 ఏళ్ల బాలుడు
ఆమెకు పుట్టబోయే బిడ్డకు బాలుడే తండ్రి అవుతాడని న్యాయస్థానం పేర్కొంది. దీంతో 13 ఏళ్ల వయసులోనే బాలుడు తండ్రిగా మారాడు. కాగా ఆండ్రియా త్వరలోనే పండంటి బిడ్డకు జన్మనివ్వనుంది. ‘ఆ బాలుడిని నా కొడుకుగా భావించా. కానీ జరిగిన పరిణామంతో ఆ బాలుడి తండ్రి కాబోతున్నాడు. నా తదుపరి జీవితం బాలుడితోనే ఉంటుంది’ అని ఆండ్రియా సెరానో తెలిపింది.
కామం మైకంలో వావి వరసలు చూడడం లేదు.. వయసు వంటి తారతమ్యాలు పట్టించుకోవడం లేదు. సొంత కుటుంబసభ్యులపై లైంగిక దాడులు జరుగుతున్నాయి. మానవ సంబంధాలు మంట గలుస్తున్నాయి. తాజాగా ఓ మహిళ తన కుమారుడి వయసు గల బాలుడితో శారీరక సంబంధం ఏర్పరచుకుంది. పక్కింటి బాలుడిని పని మీద ఇంట్లోకి పిలిపించుకుని అతడితో లైంగిక వాంఛ తీర్చుకుంది. అయితే ఆమె గర్భం దాల్చడంతో వీరి బంధం బయటకు పొక్కింది. 13 ఏళ్ల బాలుడితో 31 ఏళ్ల శారీరక బంధం ఏర్పరచుకుని తల్లిగా మారిన సంఘటన అమెరికాలో చోటుచేసుకుంది. ప్రస్తుతం వీరి పంచాయితీ కోర్టుకు చేరింది.
అమెరికా (United States)లోని కొలరాడో (Colorado) ప్రాంతంలో ఆండ్రియా సెరానో (31) (Andrea Serrano) అనే మహిళ నివసిస్తోంది. ఆమె తన కోరికలను తీర్చుకునేందుకు పక్కింట్లో ఉండే 13 సంవత్సరాల బాలుడి (13 Year’s Old Boy)పై కన్నుపడింది. ఇంట్లో (House) ఓ పని ఉందని సహాయం చేయాలని కోరి బాలుడిని ఇంట్లోకి పిలిపించింది. అలా వరుసగా బాలుడిని పిలుస్తూ క్రమంగా అతడితో శారీరక సంబంధం ఏర్పరచుకుంది. ఆమె చెప్పినట్టు బాలుడు వింటున్నాడు. అయితే ఇద్దరికీ వయసులో చాలా తేడా ఉండడంతో బాలుడు ఆ మహిళా ఇంటికి తరచూ వెళ్లడంపై అనుమానాలు రాలేదు. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దు అని కోరి తమ బంధాన్ని గుట్టుగా కొనసాగిస్తోంది. అయితే కొన్నాళ్లకు ఆండ్రియా గర్భం దాల్చడంతో ఈ విషయం బయటకు పొక్కింది. దీంతో స్థానికులు నిలదీశారు.
తన గర్భానికి (Pregnant) కారణం బాలుడేనని ఆమె తెలిపింది. బాలుడి కుటుంబసభ్యులు పోలీసుల (Police)ను ఆశ్రయించారు. బాలుడితో తనకు లైంగిక సంబంధం ఉన్న మాట వాస్తవమేనని ఆమె అంగీకరించింది. కడుపులో పెరుగుతున్న బిడ్డకు ఆ బాలుడే తండ్రి (Father) అని స్పష్టం చేసింది. ఆమె చేసిన పనికి న్యాయమూర్తులు తలలు పట్టుకున్నారు. ఇక చేసేదేమీ లేక మహిళా ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఆమెపై చర్యలు తీసుకోవడానికి వెనుకాడారు. 70 వేల డాలర్లు (దాదాపు రూ.57 లక్షలు) పూచీకత్తు (Surety)గా చెల్లించి బెయిల్ జారీ చేశారు. కాగా ఆమెకు పుట్టబోయే బిడ్డకు బాలుడే తండ్రి అవుతాడని న్యాయస్థానం పేర్కొంది. దీంతో 13 ఏళ్ల వయసులోనే బాలుడు తండ్రిగా మారాడు. కాగా ఆండ్రియా త్వరలోనే పండంటి బిడ్డకు జన్మనివ్వనుంది. ‘ఆ బాలుడిని నా కొడుకుగా భావించా. కానీ జరిగిన పరిణామంతో ఆ బాలుడి తండ్రి కాబోతున్నాడు. నా తదుపరి జీవితం బాలుడితోనే ఉంటుంది’ అని ఆండ్రియా సెరానో తెలిపింది.